24.7 C
Hyderabad
July 18, 2024 07: 49 AM
Slider ప్రత్యేకం సినిమా

సైరా నరసింహారెడ్డి చిత్రం రివ్యూ

syeraa-movie

భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కెరీర్‌లో తొలిసారిగా చిరు ఓ చారిత్రక వీరుడి పాత్రలో నటించడంతో.. వెండితెరపై ఆయన నటనను చూసేందుకు ప్రేక్షకులు ఉబలాటపడుతున్నారు. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే రీతిలో సినిమాను తెరకెక్కించామని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? లేదా చూద్దాం. 18వ శతాబ్ధంలో రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్ల వ్యవస్థ ఉంటుంది. బ్రిటీష్ వాళ్ల కిందే వాళ్లు పని చేస్తుంటారు. రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి బ్రిటీష్ వాళ్లకు జమచేయాలి. అది వాళ్ల బాధ్యత. దాంతో పాటు తమ అదుపులో ఉన్న గ్రామాల్లోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకోవాలి. అందులో రేనాడులో ఉండే ఓ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి (చిరంజీవి). పక్కా రెబల్ ఆయన. అసలు బ్రిటీష్ వాళ్లకు పన్నులు ఎందుకు కట్టాలంటూ ఉద్యమం చేస్తాడు.

ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాడు. అది బ్రిటీష్ సామ్రాజ్యానికి నచ్చదు. దాంతో ఉయ్యలవాడ వాళ్లపై తిరుగుబాటు చేస్తాడు. ఆయనకు తోడు తన గురువు గోసై వెంకన్న(అమితాబ్ బచ్చన్) కూడా గళం కలుపుతాడు. అక్కడ్నుంచి అసలు నరసింహా రెడ్డి ఏం చేసాడు అనేది అసలు కథ..చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో ప్రాణం పోసాడు. ఆయన నటించాడు అని చెప్పడం కూడా తప్పే.. జీవం పోసాడు. నిజంగానే ఉయ్యాలవాడ ఉంటే ఇలాగే ఉండేవాడేమో అనేంతగా నటించాడు ఈయన.

ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చిరు ఏజ్ అస్సలు కనిపించలేదు. నయనతార సిద్ధమ్మగా బాగా నటించింది. తమన్నా లక్ష్మీగా బాగా నటించింది. అమితాబ్ బచ్చన్ పాత్ర సినిమాకు ప్రాణం. ఉయ్యాలవాడకు వెన్నుదన్నే ఉండే పాత్ర ఇది. విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, రవికిషన్ ఇలా అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. సైరాకు అద్భుతమైన సంగీతం అందించాడు అమిత్ త్రివేది. ఈయన మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేసింది. ముఖ్యంగా ఆర్ఆర్ అదిరిపోయింది. పాటలు రెండే ఉన్నాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది.

ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగింది. సెకండాఫ్ మాత్రం అదిరిపోయింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం. సురేందర్ రెడ్డి దర్శకుడిగా తన సత్తా చూపించాడు కానీ ఇంకాస్త పర్ఫెక్ట్ ఔట్ పుట్ ఇచ్చుంటే అదిరిపోయేది. కథను ఇంకాస్త మెరుగ్గా చెప్పే ప్రయత్నం చేసుండాల్సిందేమో అనిపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. తన నూటయాభై సినిమాల అనుభవాన్ని రంగరించి సైరా నరసింహారెడ్డి సినిమా తీసినట్లుంది…అంతలా ఒదిగిపోయాడు నరసింహారెడ్డి పాత్రలో..రామ్ చరణ్ తన తండ్రికి మంచి గిఫ్టే ఇచ్చాడు….

సైరా విషయానికొస్తే ముందుగా రాంచరణ్ ని మెచ్చుకోవాలి..చరిత్ర పుటల్లో కలిసిపోయిన ఒక మహానియుడి జీవిత కథను కమర్షియల్ గా తెరకెక్కించాలంటే మాటలా..పైగా చిరంజీవి తన పన్నెండేళ్ల కల..అలాంటి ఈ సినిమాను సురేందర్ రెడ్డి చేతుల్లో పెట్టడం సాహసమే..అసలా మహానియుడికి ఇంత పెద్ద కధ ఉందానిపిస్తోంది.. అలాంటి కథను స్వాతంత్య్రం విలువ మర్చిపోతున్న ఈ తరానికి ఖచ్చితంగా చూపించాలి..అందుకే హేట్సాఫ్ రాంచరణ్…ముఖ్యంగా ఈ చిత్రంలో పాత్రలే కనబడతాయి పాత్రధారులు కనబడరు..

దర్శకుడు సురేందర్ రెడ్డి చేసిన కసరత్తంతా మనకు తెరపై కనబడుతుంది..ఇలాంటి సినిమాకు స్క్రీన్ ప్లే రాయడమంటే మాములు విషయం కాదు…సాయి మాధవ్ బుర్రా మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి..రత్నవేలు ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది..ప్రథమార్థంలో పాత్రల పరిచయానికే ఎక్కువ టైమ్ తీసుకుంటాడు దర్శకుడు దానితో అక్కడక్కడా డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది.. ద్వితీయార్థంలో దర్శకుడు ఆ ఛాన్స్ మనకివ్వడు…చివరి అరగంట రోమాలు నిక్కబొడుచుకుంటాయంటే నమ్మాలి…

విజయ్ సేతుపతి, సుదీప్,అమితాబ్ వీరందరి కాంబినేషన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగే..నయనతార కంటే కూడా తమన్నా పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది..మొత్తానికి అవురావురుమంటూ ఎదురుచూస్తున్న అభిమానులకు సైరా నరసింహారెడ్డి అసలైన దసరా పండుగ. – ఆనంద్ తాళ్లూరి

Related posts

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడికి డీజీపీ బాధ్య‌త వ‌హించాలి

Satyam NEWS

ధార్మిక విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లిం విధి

Bhavani

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Satyam NEWS

Leave a Comment