32.2 C
Hyderabad
April 20, 2024 19: 06 PM
Slider సినిమా

‘క్ష‌ణం క్ష‌ణం’ ఉత్కంఠ రేపే చిత్రంః హీరో ఉద‌య్ శంక‌ర్

#Hero Uday

‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్, జియా శర్మ జంటగా కార్తీక్‌ మేడికొండ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్షణ క్షణం’. డాక్టర్‌ వర్లు, మన్నం చంద్ర మౌళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో ఉద‌య్ శంక‌ర్ స‌త్యం న్యూస్ ప్ర‌తినిధితో చిత్ర విశేషాల‌ను పంచుకున్నారు. 

ప్రః మీ గ‌త చిత్రాల‌కు  భిన్నంగా ఉంటుందా ఈ చిత్రం..

జః నేను గ‌తంలో ఆట‌గ‌ద‌రా శివ‌, మిస్ మ్యాచ్ చిత్రాల‌లో న‌టించాను. న‌ట‌నాప‌రంగా ఈ రెండు చిత్రాల‌కూ మంచి మార్కులే ప‌డ్డాయి. తెలుగు ప్రేక్ష‌కులు ఇప్పుడిప్పుడే న‌న్ను గుర్తు పెట్టుకుంటున్నారు. గ‌తంలో నేను చేసిన ఆ రెండు చిత్రాల‌కు భిన్న‌మైన చిత్రం ఇది. క్ష‌ణం క్ష‌ణం టైటిల్ కు త‌గ్గ‌ట్ల‌గా ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. 

ప్రః గ‌తంలో వెంక‌టేష్‌, శ్రీ‌దేవిల క్ష‌ణం క్ష‌ణం ఛాయ‌లు క‌నిపిస్తాయా ఈ చిత్రంలో?

జః దానికి దీనికి పోలికే లేదు. అయితే టైటిల్ కు త‌గ్ట‌ట్లే  ప్ర‌తి సీన్ మంచి గ్రిప్పింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్ష‌కులు థ్రిల్ అయ్యే అంశాలు చాలా ఉంటాయి.

ప్రః ద‌ర్శ‌కునితో మీ ట్రావెల్ ఎలా ఉంది?

జః కార్తీక్‌ మేడికొండ ద‌ర్శ‌కునిగా త‌న‌కు కావ‌ల‌సిన‌ది రాబ‌ట్టుకుంటాడు. వ‌ర్క్ విష‌యంలో చాలా సిన్సియ‌ర్‌. తీయ‌బోయే సీన్ మీద మంచి క‌మాండ్ ఉండేది. అన్నీ తానై భుజ‌స్కందాల‌పై న‌డిపించారు. ఏ విష‌యంలోనూ మా ఇద్ద‌రి మ‌ధ్య‌ మిస్ అండ‌ర్ స్టాండింగ్స్ వ‌చ్చేవి కావు. పైగా సేమ్ గ్రూప్ ఏజ్ కావ‌డంతో మాకు ప్ల‌స్ అయింది. ఫ్రెండ్లీగా క‌లిసిపోయే నేచ‌ర్ ఆయ‌న‌ది. 

ప్రః క్ష‌ణం క్ష‌ణం లో హైలెట్ అంశాలు ఏమిటి?

జః ఈ చిత్రానికి పెట్టిన క్యాచీ టైటిలే హైలెట్‌. ఇక సెకండాఫ్ లో చిత్రం చాలా స్పీడ్ గా ర‌న్ అవుతుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ ఇంత‌క‌న్నా చెబితే  ఎక్కువ‌గా ఉంటుంది. సినిమా చూశాక మీరే చెబుతారు..ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే అంశాలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. 

ప్రః  నిర్మాత‌ల గురించి…

జః  మంచి నిర్మాత‌లు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా, ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా చిత్రాన్ని నిర్మించారు. ఎక్క‌డా చిన్న సినిమా అనే భావ‌న క‌ల‌గ‌నీయ‌లేదు. 

ప్రః   హీరోయిన్ ఇంపార్టెన్స్ గురించి…

జః    ఈ చిత్రంలో నాకు జోడీగా జియాశ‌ర్మ న‌టించింది. హీరోయిన్ ఇంపార్టెన్స్ కూడా ఈ చిత్రంలో ఎక్కువే. 

ప్రః   మ్యూజిక్‌, ఆర్.ఆర్ గురించి..

జః  క్ష‌ణం క్ష‌ణం చిత్రానికి సంగీతం, ఆర్ ఆర్ ఓ రేంజ్‌కి తీసుకెళ‌తాయి. కోటి మాస్ట‌ర్ గారి అబ్బాయి రోష‌న్ సాలూరి టాలెంట్ ఏమిటో ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. 

ప్రః  మీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి…

జః మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో జ‌డ్జ‌ర్ల మాది. మా ఫాద‌ర్ ప్రొఫెస‌ర్ శ్రీ‌రాములు. మామ‌య్య ప్ర‌ముఖ నిర్మాత రాక్ లైన్ వెంక‌టేష్‌. అయితే సినిమాల‌పై 15 సంవ‌త్స‌రాల వ‌య‌సునుంచే ఇంట్రెస్ట్ ఉండేది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు వీరాభిమానిని. ఇంట్లో వాళ్ల భ‌యంతో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన త‌ర్వాతే సినిమాల‌లోకి వ‌చ్చాను. మొద‌ట్లో లింగ‌, ప‌వ‌ర్ లాంటి చిత్రాల‌లో సైడ్ క్యారెక్ట‌ర్లు చేశాను. ఆట క‌ద‌రా శివ‌, మిస్ మ్యాచ్ చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడ‌క‌పోయినా మంచి పేరు తెచ్చిపెట్టాయి. చిన్న‌త‌నంలో నంబర్లు గుర్తుపెట్టుకుని వేల నంబ‌ర్ల‌ను బోర్డుపైన రాసి మెమొరీ ప‌వ‌ర్ లో గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాను. అయితే సినిమాల‌మీద ప్యాష‌న్ తోనే ఈ రంగంలోకి వ‌చ్చాను. 

ప్రః  ఎలాంటి క్యారెక్ట‌ర్లు చేయాల‌నుకుంటున్నారు?

జః   ఫ‌లానా అంటూ ఒకే క్యారెక్ట‌ర్ కి క‌ట్టుబ‌డ‌కుండా యాక్ష‌న్ ప్ర‌ధాన చిత్రాలు చేయాల‌నేది నా ఆకాంక్ష‌. వ్య‌క్తిగ‌తంగా హార‌ర్ చిత్రాలు ఇష్టం. ప్రేక్ష‌కులు న‌చ్చే సినిమాలు చేయాల‌నేది నా ఆశ‌యం. 

ప్రః  కొత్త‌గా హీరోగా వ‌చ్చేవారికి మీరిచ్చే సూచ‌న‌లు

జః   ఓపిక‌, స‌హ‌నం, అంకిత‌భావం ఉండాలి. అంత‌క‌న్నా ముందు డెడికేష‌న్ ఇంపార్టెంట్‌. న‌ట‌న పూర్తిగా తెలుసుకుని ఈ రంగానికి రావాలి. నా మ‌టుకు మ‌ధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్ష‌ణ తీసుకున్నాను. కీ.శే. దీక్షితులు మాస్ట‌ర్ నాకు న‌ట‌న‌లో మెల‌కువ‌లు నేర్పించారు. ఓ న‌టుడిగా న‌న్ను నేను నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 

-నండూరి ర‌విశంక‌ర్

Related posts

కరోనా:చిల్కూర్ బాలాజీ టెంపుల్లో ప్రత్యేక పూజలు

Satyam NEWS

వెల్ డన్: మంత్రి పువ్వాడకు కేటీఆర్ అభినందన

Satyam NEWS

పాత్రికేయుల కుటుంబ సంక్షేమమే శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment