37.2 C
Hyderabad
April 19, 2024 13: 51 PM
Slider కవి ప్రపంచం

సొంతూరికి పోతున్నా . . .

#Kandalai Ragahvacharya

నడుసుకుంటు  ఉరుక్కుంటు

ఒంటెక్కి రైలెక్కి లారెక్కి  బండెక్కి

పడుకుంట లేసుకుంట

సెట్టునీడ ఆగుకుంట

దొరికింది తినుకుంట

వానలోన నానుకుంట

ఎండలోన ఎండుకుంట

రాత్రనక పగలనక

దూరమైన భారమైన

కాళ్లను లాగుకుంటు

లేనిబలం తెచ్చుకుంటు

మా సొంతూరికి పోతున్నా !

పని లేక

పైసలేక

పక్షివోలె బతుకైంది

దొరికిందే మెతుకైంది

చూరు నీడ ఇల్లైంది

కష్టకాలం పరదేశికి

సొంతూరే యాదికస్తది

సొంత ఊరే తల్లి తండ్రి

చిన్న పనులు ఐతేనేం

ఉన్న ఊరే బతికిస్తది

చెరువు నీరే పాశమైతది

నడవంగ నడవంగ

మా ఊరు రాకుండ ఉంటదా

దగ్గరే అనిపిస్తది

బతికినా అక్కడే ఇక

సచ్చినా అక్కడే

– కందాళై రాఘవాచార్య, నిజామాబాద్, 8106555633

Related posts

సోషల్‌ మీడియాలో అవాస్తవ సందేశాలు పంపితే చర్యలు

Satyam NEWS

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS

విద్వేషపూరిత ప్రసంగంతో కోర్టు మెట్టెక్కిన ఓవైసీ

Satyam NEWS

Leave a Comment