28.2 C
Hyderabad
April 20, 2024 14: 10 PM
Slider కవి ప్రపంచం

బతుకు పాఠం

#C S Rambabu

ఆపనీ ఈపనీ చేస్తూ పొట్ట పోసుకునే

కష్టజీవుల పొట్టకొట్టేశాం

కాలం కరాళ నృత్యం చేస్తుంటే

కాళ్ళను నమ్ముకుని కానరాని

దూరానికి అడుగులు వేస్తున్న వారి కష్టాలు

వేతనజీవులం మనకేం తెలుసు

ఎవరిమీదా నిందవేయలేదు.. కర్మనుకోలేదు

ఏ వ్యక్తిత్వ వికాసాన్ని నమ్ముకోలేదు

ఇంటిముందు కూలబడితే

ఇంటిముద్ద నోటబడితే

అమ్మ స్పర్శో నాన్నచూపో ఆత్మీయంగా తాకుతుంటే

అక్కనవ్వో తమ్ముడి పలకరింపో

కాస్త నమ్మకాన్ని చిలకరిస్తుందన్న

చిన్న ఆశ అనంత దూరానికైనా

అడుగులను పేర్చుకుంటూ వెళ్ళమంటుంది

కన్నెత్తక నగరాలు దాటుతుంటారు పలకరించే చూపులను పరిశీలించే చూపులను దాటుకుంటూ

ఏదాత కోసం ఎదురుచూడరు

ఆకలిని పేగులమధ్య బంధిస్తారో

దాహాన్ని నాలిక కింద దాచేస్తారో

కానీ..జీవితమనే మరాథన్ తో

పోరాటం చేస్తూనే ఉంటారు

వైరలవుతూ వీడియోలు,

కదిలిస్తూ కధనాలు వెలువడుతూనే ఉంటాయి

అవేమీ తెలియని వలసకోయిలలు వారు

వసంతంలేదు.. వెన్నెలలు లేవనుకోక తదేకదీక్షతో

సాగుతుంటారు

జీవితపు ఎవరెస్ట్ నెక్కే టెన్సింగ్ నార్కేల్లా

వారి బతుకు పాఠాన్ని

రేపటితరానికి డీకోడ్ చేస్తే

కాస్త ఋణం తీర్చుకున్నవారమవుతాం

సి.యస్.రాంబాబు

Related posts

రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి

Satyam NEWS

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Satyam NEWS

క్వింటా ఒక్కింటికి 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment