27.7 C
Hyderabad
April 26, 2024 04: 36 AM
Slider కవి ప్రపంచం

మహా ప్రస్థానం

Dr.Vaani Devulapally

సక్రమమైన ఈ లాక్ డౌన్ లో

కూడా ఏమిటిది

రోడ్లు ఈనినట్టు ఎక్కడ చూసినా జనం…!

బారులు బారులు గా

పాదచారులుగా

ఇసుక వేస్తే రాలనంతగా జనం..!

ఊరు ఊపిరై

ఊపిరి నడకై

నడకే గమ్య మై

గమ్యం ఆశల వెలుగై

ఆశ కొడిగట్టని దీపమై

పయనం.. పయనం!

ఓ మహా ప్రస్థాన మై పయనం!

ఎండవేడిమి పండు వెన్నెల గా భ్రమిస్తూ

కంకర రోడ్లు కన్నెర్ర జేసిన

కాలి బొబ్బల్ని లెక్కచేయక

కాలే కడుపుల్ని గుక్కెడు నీళ్లతో తడుపుతూ

నెత్తిన మూటైన

బెత్తెడు సంసారం తో

చంకన పసిబిడ్డ తో

భవిష్యత్తు అంతా

ప్రతి అడుగులో ప్రతిబింబిస్తూ

చిటికెన వే లై నడుస్తున్న

చిట్టి పాదాల చిన్న తల్లి తో

రాత్రనక పగలనక

పయనం.. పయనం!

ఓ మహా ప్రస్థాన మై పయనం!

కూడ దీసుకొని వేసే ప్రతి అడుగు లో

బతుకు బరువును దింపుకుంటూ

భరోసా గా కదిలే పాదాలు

జీవన వేదాలై

సజల నయనాలు

ప్రాణ దీపాలై

పయనం.. పయనం!

ఓ మహా ప్రస్థాన మై పయనం!

కన్నతల్లి వంటి ఉన్న ఊరును

కంటితో చూసేదాకా

అయినవాళ్ళందరి కడుపులో

తల పెట్టి దుఃఖ భారం దింపుకునేదాకా

ఆత్మీయ ఆలింగనం చేసుకునే దాకా

పుట్టి పెరిగిన నేలను

తనివి తీరా ముద్దాడే దాకా

నా దేశం ఇలా పయనిస్తూ నే ఉంటుంది

అలుపెరుగని పాద మై

ఓ మహా ప్రస్థాన మై…!

– డా. వాణీ దేవులపల్లి, వరంగల్

Related posts

[Free Trial] Diabetes New Medicines Vitamin To Reduce Blood Sugar An Abnormally High Concentration Of Glucose In The Blood

Bhavani

జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు

Satyam NEWS

ఆటో డ్రైవ‌ర్ల‌కు విజ‌య‌న‌గ‌రం ట్రాఫిక్ డీఎస్పీ క్లాస్…!

Satyam NEWS

Leave a Comment