35.2 C
Hyderabad
April 20, 2024 17: 42 PM
Slider కవి ప్రపంచం

దు:ఖపు మచ్చ

#Dr.Kanchanapally Gora

పాదాలు రోడ్డు సూర్యుని మీద

మునిగితేలుతుంటాయి

కాకి నోటిలో అరపు

అయిన సర్కారుకు

భయపడిన ప్రయాణాలు

అరణ్యాల ముసుగులోని

రహస్యపు

కొనసాగింపు లవుతాయి

భుజాల నుండి

జారిపడుతున్న

తన నెత్తుటి కూన

చూపుడు వ్రేలుకు వ్రేలాడే

వర్షంలో తడుస్తున్న

ఊరపిచ్చుక లాంటి

పసితండ్రి

గూడైనా గుట్టైనా

తన అడుగులో

అడుగైన సగం ప్రాణం

ఎవడు విడిచిన

నిట్టూర్పూ కదా అతను?

తన రెక్కల చెమట

బిందువులు ఎందరు

చీకటి మనుషులను

మహాదాతలను చేశాయో?

తన కంటి నదుల్లో

ఊపందుకుంటున్న

అధికార మూలాలు

ఎందరికి అహంకారపు

మత్తు మందై ప్రవహించాయో

ఒక అదృశ్య అల్ప జీవి

తన నిలా తరిమి కొట్టింది

ఈ వ్యవస్థ సాధించిన ఎంత

అరాజక రాజకీయం అతడు?

ఈ అన్నపూర్ణ

విదిలించిన అర్ధరాత్రి

చలి నెగడు అతడు

నాగరిక నటనలకు

ఇప్పుడొక సమాధానం

లేని ప్రశ్న అతడు

విరిగిన రోజుల ముక్కలలో

ఈ దేశం తల ఎత్తలేని

దుఖం మచ్చ అతడు?

డాక్టర్ కాంచనపల్లి గోరా, సెల్ నెం 9676096614

Related posts

తిరుపతిలో ఈ నెల 30న గో మహాసమ్మేళనం

Satyam NEWS

క్వశ్చన్ అవర్: కరీనా కపూర్ కొడుకు పేరు ఏమిటి?

Satyam NEWS

పిల్లి పిల్లలను మార్చినట్లు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి!

Satyam NEWS

Leave a Comment