36.2 C
Hyderabad
April 23, 2024 19: 09 PM
Slider కవి ప్రపంచం

మృతవీర సైనికులకు జోహార్లు

#K.Haranath

శాంతి వచనాలు వల్లిస్తూ నే

చైనా రసాభాసాన్ని చేసింది

లడక్ హిమాలయ మంచు కొండల్నీ

చైనా సరిహద్దు హద్దుల్నీ

హద్దులు దాటి అనాగరిక పిరికి చర్యలకు

అద్దం పట్టిన నరహంతకుల దొంగ దెబ్బ

కాలకూట విషాన్ని కక్కిన కిరాతక చర్య

ఈ దారుణ మారణ కాండకి

చైనా సైనిక దుర్మార్గులారా

సిగ్గుతో తలదించుకోవాల్సిన

నీచ నికృష్ట చర్య

ఇరవైమంది భారత వీర జవాన్లు

అసువులు బాయటం ఇది యుధ్ధభేరికి సన్నాహమా

కవ్వింపు చర్యలకు కుతంత్రమా

ఏది ఏమైనా……

రక్కసి నీడలో నేలరాలిన

భారత సైనక మృతవీర రత్నాల్లారా

జోహార్లు    జోహార్లు

కె.హరనాథ్, 9703542598

Related posts

వైసీపీ అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ

Satyam NEWS

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS

వారసత్వ పొలం కోసం దారుణంగా నరికి చంపారు

Satyam NEWS

Leave a Comment