40.2 C
Hyderabad
April 19, 2024 18: 34 PM
Slider ప్రత్యేకం

రియలైజేషన్: నెత్తికెక్కిన కళ్లు ఇప్పుడు నేలచూపులు

trump 192

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

ప్రపంచ దేశాలన్నీ కరోనా ను ఎదుర్కొనేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. అయినా పలు దేశాలలో కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. 7 లక్షల కు పైగా కరోనా కేసులతో, దాదాపు 33 వేల మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ

వరుసగా తరువాత వరుసలో ఉన్నాయి.

ఇప్పటిలో కరోనా ఉద్ధృతి తగ్గే సూచనలు లేవని సభ్య దేశాలు మరింత  రక్షణ చర్యలు తీసుకోవాలని డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరించింది. వాస్తవాలు ఇలా ఉండగా మార్కెట్లను పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ప్రకటించారు. దీనికోసం మూడు దశల ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా నిరుద్యోగ భృతి కోసం  అదనంగా 52 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు కార్మిక శాఖ చెప్పిన నేపథ్యంలో సాధ్యమైనంత  త్వరలో ఆర్ధిక కార్య కలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా దెబ్బకు దేశంలో దాదాపు 2.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ప్రకారం ఈ ఏడాది  అమెరికా ఆర్థిక వ్యవస్థ 5.9  శాతం కుంచించుకుపోతుంది. ఈ విషమ పరిస్థితుల్లో ప్రపంచంలో  అతి పెద్దదైన  తమ ఆర్థిక వ్యవస్థ ని  చక్కదిద్దేందుకు ట్రంప్ మార్కెట్లు తెరవాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇంత కాలం రాష్ట్రాల గవర్నర్ ల సలహాలు తృణీకరించిన ట్రంప్ స్వరం మార్చడం  గమనీయం. మార్కెట్ల పునరుద్ధరణ పై ఆయా రాష్ట్రాల గవర్నర్లదే తుది నిర్ణయమని…ఫెడరల్ ప్రభుత్వం వారికి  పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రకటించారు.

అమెరికా లో కరోనా ప్రవేశించిన తొలి దశలో ఈ తరహా విచక్షణతో గవర్నర్ల సలహాలు  లక్ష్యపెడితే పరిస్థితులు ఇప్పుడున్నంత దారుణంగా ఉండేవి కాదని విమర్శలొస్తున్నాయి. అమెరికా లో  కరోనా తీవ్ర తను గుర్తించి తగిన  ముందస్తు  చర్యలు  తీసుకోవాలని హెచ్చరించిన  నిపుణుల  మాటలను  ట్రంప్  పట్టించుకోలేదు.

మార్చి 11 న తొలిసారిగా ప్రపంచ  ఆరోగ్య సంస్థ  కరోనా ను  మహమ్మారిగా ప్రకటించింది. కరోనా  పరీక్షల ను విరివిగా  విస్తృత స్థాయిలో  జరపాలని,  వైరస్ సోకినట్లుగా  అనుమానం ఉన్న వారిని  బయటకు  వెళ్లనీయక గృహ నిర్బంధంలో ఉంచాలని  వ్యాధి విస్తరిస్తున్న  దేశాలను  హెచ్చరించింది.

మార్చి 13 న అమెరికా అధ్యక్షుడు ట్రంప్  జాతీయ ఎమర్జెన్సీ విధించారు.. సరిగ్గా వారం రోజుల్లో కోవిడ్-19 దేశమంతా  విస్తరించింది. అప్పటికీ  ట్రంప్  సమస్య ను తీవ్రంగా  తీసుకోలేదు. అమెరికాలో  లాక్ డౌన్  ప్రకటిస్తే  ఆత్మహత్య లు పెరిగి కొత్త సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఏప్రిల్ 12  నాటికి ఆంక్షలన్నీ  తొలగిస్తానని, అప్పటికి దేశంలో  సాధారణ  పరిస్థితులు  నెలకొంటాయని నమ్మబలికారు..రాగల అనర్ధాలను  గుర్తించి  యుద్ధ ప్రాతిపదికన  చర్యలు చేపట్టాలని సూచించిన  ఉన్న త స్థాయి ఆరోగ్య నిపుణుల సలహాలు  తోసిపుచ్చిన  పర్యవసానం  పెద్ద సంఖ్యలో ప్రజల  ప్రాణాలు  బలి తీసుకుంటోంది.

కరోనా వైరస్ వంటి  అంటు వ్యాధులు ప్రబలినప్పుడు  ముందుగానే  నివారణ  చర్యలు తీసుకుని ఉంటే  మరణాల సంఖ్య  తగ్గేదని అమెరికా  పరిశోధకుల విశ్లేషణ. 1918-19 సంవత్సరాల లో ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ బారి నపడి 5 కోట్ల మంది చనిపోగా …అమెరికా లో 6.75 లక్షల ప్రజలు బలయ్యారు.

పాఠశాలల మూసివేత, సభలు, సమావేశాల  పై నిషేధం , కఠినమైన ఐసోలేషన్ విధానాలు, పరిశుభ్రత పాటించడం, మాస్కులు ధరించేలా చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ సొసైటీ ఆఫ్ సైటోపేథాలజీ  జర్నల్ లో ఇటీవల ప్రచురితమయ్యాయి.

ఒకవైపు  రోజు రోజు కి  క్షీణిస్తున్న  ప్రజారోగ్య వ్యవస్థ,  మరో వైపు  దిగజారుతున్న  ఆర్ధిక వ్యవస్థ కారణంగా నానాటికీ  దేశంలో అస్తవ్య స్థ  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగామించాలంటే  ఆర్ధిక వ్యవస్థను సత్వరం గాడిలో  పెట్టడం అత్యావశ్యకమని  ట్రంప్ కొత్త బాణీని అందుకున్నారు.

దీనికి తోడు అమెరికా కీలక శాఖలు ఇరుగుపొరుగు దేశాలతో ఉన్న సాంకేతిక, వాణిజ్య,వ్యాపార  సంబంధాలు పరంగా సమీక్షించాలని ట్రంప్ కు సలహా లు ఇస్తున్నారు. అమెరికా మార్కెట్లో మొబైల్ సేవలు అందిస్తున్న చైనా టెలికాం ను నిషేధిస్తా మని   హెచ్చరించింది.

భద్రత, న్యాయపరమైన ముప్పు ఉందంటూ అమెరికా న్యాయ,రక్షణ, అంతర్గత భద్రత, వాణిజ్య శాఖ లు ఎఫ్ సి సి ని కోరాయి. అదే జరిగితే కోట్లాది అమెరికన్ల ఫోన్ సేవలకు విఘాతం ఏర్పడనుంది. అమెరికా చర్యలను చైనా వ్యతిరేకించింది.

అమెరికా మార్కెట్ విధానాలకు కట్టుబడి ఉండాలని, వాణిజ్య  విషయాలను రాజకీయం చేయడం ఆపాలని చైనా విదే  శాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీజియాన్ ప్రకటన విడుదల చేశారు.కరోనా తో తీవ్ర ఇక్కట్లు పాలవుతున్న సమయంలో అమెరికా ఆచితూచి వ్యవహరియించాలని సభ్య దేశాలు హెచ్చరిస్తున్నాయి.

అమెరికా లోని 19 రాష్ట్రాల్లో కోవిడ్-19 ప్రభావం అంతగా లేదని…కనుక ఆయా ప్రాంతాల్లో మార్కెట్ వ్యవస్థ ను పునరుద్ధరించవచ్చని గవర్నర్లు యోచిస్తున్నారు. ఇప్పటికే 8.7 శాతానికి పడిపోయిన రిటైల్ అమ్మకాలు అమెరికా లో నెలకొన్న ఆర్థిక మాంద్యం ముఖ చిత్రాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్థ  కు జవసత్వాలు ఇచ్చే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత బుధవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలనుంచి వడ్డీ లేని చెల్లింపులు స్వీకరించాలని అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

దీనివల్ల సుమారు 200 బిలియన్ డాలర్ల  ద్రవ్యనిధి సమకూరగలదని ఆశా భావం వ్యక్తం చేశారు. అంతే కాక చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు, పరిశ్రమ లకు నామమాత్ర వడ్డీ తో ఆర్ధిక సహకారం అందించాలని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 8.3 బిలియన్ డాలర్ల నిధులను  కేటాయించారు.

వైరస్ నియంత్రణ కు , వాక్సిన్ తయారీకి  ఈ నిధులు ఖర్చు చేయాలని ప్రజారోగ్య శాఖను ఆదేశించారు..అయితే.. డ బ్ల్యూ హెచ్ ఓ కి నిధుల విడుదల ఆపడం ఇటు వంటి క్లిష్టసమయంలో అమెరికా కు తగదని , వైరస్ మహమ్మారి పై ఉమ్మడి పోరు ఒక్కటే పరిష్కారమంటుున్న పలుదేశాల విజ్ఞప్తుల ను ట్రంప్ తోసిపుచ్చడం  చారిత్రక తప్పిదం కాగలదు.

కృష్ణారావు (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి)

Related posts

విశాఖలో ఎంపీ ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ కలకలం

Bhavani

పిచ్చుక

Satyam NEWS

సమగ్ర శిక్ష లో పేరుకు పార్ట్ టైం, పనిచేస్తుంది ఫుల్ టైం

Satyam NEWS

Leave a Comment