32.2 C
Hyderabad
April 20, 2024 19: 32 PM
Slider కవి ప్రపంచం

ఈ ప్లవం మహమ్మారిపై తిరుగుబాటు విప్లవమే..

#plavanamasamvatsram

రెండు ఉగాదులు

కరోనా నీడలో..

తగ్గిందనుకుంటే ఇప్పుడది  ఊడల మర్రిలా..జడల బర్రిలా

మొదలది చైనా కుట్ర

ఇప్పుడు పులి మీద పుట్ర..!

ఊహాన్లో మొదలై ఊహకందని వేగంతో జగమెల్ల విస్తరించి

జనమునెల్లను కల్లోలపరచి..

మెల్లన ఉపశమించి..

ఆపై శాస్త్రవేత్తలు పరిశ్రమించి

వాక్సిన్ తీసుకురాగా

మొత్తానికి మంగళం

అనుకునే వేళ మరోసారి

మహమ్మారి విస్తరణ…

మానవ జాతికి మరో జాగరణ!

సరే..మానవ జీవితమే పోరాటాల మయం..

మనుగడకు అనుకూలంగా..

మరణానికి వ్యతిరేకంగా..

యుగాల తరబడి ఇదే ఒరవడి

కనిపించే శత్రువులతో..

కనిపించని క్రిములతో…

గత ఏడాదిన్నర నుంచి కరోనాతో..

చలోనా చలోనా అంటూ..!

శార్వరి మొత్తం వర్రి..

బ్రతుకులకు కొర్రి..

శార్వరి అంటే చీకటి..

అలాగే గత ఏడాది

అధిక భాగం

లాక్డవున్ చీకట్లలో…

ఇప్పుడొచ్చింది ప్లవ..

శుభాలను మోసుకుంటూ..

ప్లవ అనగా దాటించేది..

కరోనా రక్కసి గండం నుంచి మానవాళిని గట్టెక్కించే వత్సరం..శుభ సంవత్సరం..

మనుషులెల్లరు వాక్సిన్ ఆయుధం ధరించి..

మాస్కు రక్షణతో

భయాన్ని జయించి..

సామాజిక దూరంతో

మహమ్మారిని ఎదిరించి

కొన్నాళ్లు..ఇంకొన్నాళ్లు

నిబంధనల కవచంతో

ముందుకు వెళ్తే

వచ్చే ఉగాది నాటికి కరోనాకి

చరమగీతం..

అప్పుడిక శుభకృత్..

ఆ వచ్చే ఉగాది జగతికి

మానవ జాతికి

శోభకృత్..

ఈ ఉగాది నాందిగా

ఉందిలే మంచి కాలం

ముందు ముందూనా..

ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్

Related posts

స్వీట్లు పంచుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు

Satyam NEWS

Big News: బెంగాల్ దంగల్

Satyam NEWS

యాదాద్రి వద్ద భారీ ఎత్తున పట్టుబడ్డ బంగారం

Satyam NEWS

Leave a Comment