32.7 C
Hyderabad
March 29, 2024 12: 36 PM
Slider కవి ప్రపంచం

ఒక్కమాట విను…

#srisudha

ఓటుకు నోటంట!! అవ్వ- ఎంత సిగ్గుచేటు…

ప్రజాస్వామ్యంలో పాలక ప్రతినిధులను ఎన్నుకునే హక్కే “ఓటు”

ఎందరో త్యాగధనులు ప్రాణాలర్పించి మనకు  స్వాతంత్ర్యం తేస్తే-

ఎందరో మేధావులు మనకంటూ –

ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసి…

మన దేశాన్ని గణతంత్ర దేశంగా…

సర్వసత్తాకత ఆపాదించి, మనందరికీ హక్కులను ఇస్తే…

ఐదేళ్లకొకసారి మన బాధ్యతగా సర్వసమర్థుణ్ణి మన ప్రతినిధిగా ఎన్నుకోమంటే- ఇదా! ఇదా మనం చేసేది??

అభ్యర్థి పూర్వాపరాలు చూసిచూడనట్టుండి-

కాసిని నోట్లకు…మన ఓట్లను అమ్ముకుంటున్నామా?? 

ఆ నోట్లు..ఆకలిచావులు ఆపుతాయా??

మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాయా??

ఆడబిడ్డలను కీచలకుల పాలుగాకుండ ఆపుతాయా??

రైతుల ఆత్మహత్యలు ఆపుతాయా??

ఎవరో దాకా ఎందుకు?? మరో ఐదేళ్లు నీకే కష్టం రాకుండా కాపుగాస్తాయా??

ఈ ప్రశ్నలన్నిటికి నీ దగ్గర జవాబుంటే-

ఆ జవాబు నీకు సమంజసంగా అనిపిస్తే ….

అమ్ముకో నీ హక్కును …సిగ్గులేకుండా!!

లేకపోతే- ఈసారి కొనుక్కుంటానని వచ్చినవాడిని కాలరుపట్టి రోడ్డుకు ఈడ్చిపారేయ్!!  

నీ ఓటుతో మార్పుకు నాంది పలుకు!!

శ్రీ సుధ కొలచన, హైదరాబాద్

Related posts

విశాఖ నే పూర్తి స్థాయి రాజధాని అవుతుంది

Satyam NEWS

విద్యల నగరంలో వ్యాపారి కిడ్నాప్…24 గంటలలో కేసు ఛేదింపు

Satyam NEWS

విజయనగరం ఎస్ పి ఆకస్మిక పర్యటన: లాక్ డౌన్ పర్యవేక్షణ

Satyam NEWS

Leave a Comment