తొలకరి జల్లుతో
పుడమి పులకించె
ప్రకృతి పరవశించె
ఆకాశాన హరివిల్లు వెలిసె
వసుధ కు వర్ణాల
దుప్పటి కప్పె
మందము గా వచ్చిన
మంచు మేఘాలిచ్చె
నీటిని ఒడిసి పట్టి
అందరి ఆనందాలకు
ఆలవాలమయ్యె
వర్షాకాలం అందించే
సౌందర్యంతో
మన హృదయం పొంగె
చిన్నారుల మోములో
చిరు నవ్వులు విరిసె
వర్షపు నీటిలో
కాగితపు పడవలు
వదిలి ఆటలాడుకొనుటకై
మనసు ఉవ్విళ్ళూరె
కన్నవారి కన్నులలో
కాంతి మెరిసే
రైతు మోముపై
చిరునవ్వులు విరిసే
కష్టాన్ని నమ్ముకొని
భువిని దున్ని
పంట పండించుటకై
సర్వవిధాల
సన్నద్ధం మాయే
పశుపక్ష్యాదులు
అనేక జీవరాసులను
పుడమి అక్కున చేర్చుకొని
ఆకలి దప్పిక తీర్చి
ఆవాసాన్ని ఆనందానిచ్చి
చల్లబర్చి సేద తీర్చే
పలుమార్లు
ధగ ధగ మెరుపులు
ధడేల్ ధడేల్ ఉరుములతో
కాసింత భయకంపితం చేసె
మహిమాన్విత ప్రకృతి
పునరావృత పరంపర
అందరిని సమదృష్టితో
కొన్నిసార్లు ఎక్కువ
ఇంకొన్ని సార్లు తక్కువ
ప్రభావాలతో ప్రతి సాలు
సాగిపోతూనే ఉంది.
సంధ్య సుత్రావె, హైదరాబాద్, ఫోన్: 9177615967