37.2 C
Hyderabad
April 19, 2024 13: 46 PM
Slider కవి ప్రపంచం

అంతా నీ వల్లే…

#Manjula Surya New

అంతా నీవల్లే

అంతటా నీ ఊహల్లే

అల్లుకుపోతుంటాయి అల్లికల్లే

అందమైన పద కవితల్లే

సందుదొరికితే వచ్చేస్తావ్ చాప కింద నీరల్లే

తిష్ఠ వేస్తావ్ సింహాసనమల్లే

మెత్తగా తాకుతావ్ మరుమల్లె పూవల్లే

మత్తుగా జోకొడతావ్ లాలిపాటల్లే

పరుగులెత్తిస్తావు చిరుతల్లే

అందిపుచ్చుకుంటే నిండిపోతావ్

పరిమళమల్లే

మమేకమైతే కరిగిపోతావ్ కర్పూరమల్లే  అంతటా కప్పేస్తావ్ ఆకాశమల్లే

కొలువుంటావ్ గుండె గూటిలో గుడల్లే

చేరువుంటావ్ కనుపాపల్లో  బొమ్మల్లే

వెన్నెలే కురిపిస్తావ్ చంద్రుడల్లే

వెల్లువే అవుతావ్ సాగరమల్లే

నిండిపోతావ్ అంతటా వెలుగల్లే

అణువణువు పాకుతావ్ కరెంటల్లే

ప్రాణాన్నే శాసిస్తావ్  శ్వాసల్లే

నేనే  నీవవుతావ్  నీ ఆలోచనల్లే

నన్నే మరిపిస్తావ్ అద్భుతమల్లే

తనువంతా నలుగులా పసుపల్లె

మిగిలిపోతావ్ ఎప్పటికి

నుదుట సింధూరమల్లే

జత కడతావ్ తోడుగా ఏడడుగులల్లే

అంతా నీ వల్లే….

నీవు లేకుంటే జీవితం వల్లకాదల్లే..

అది వల్లకాడల్లే

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

విజయనగరం లో నేషనల్ యూనిటీ డే: పటేల్ కు నివాళులు..!

Satyam NEWS

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

Satyam NEWS

కాంట్రవర్సీ: అర్చకుల లెక్కలు గోవిందార్పణం

Satyam NEWS

Leave a Comment