37.2 C
Hyderabad
March 29, 2024 20: 13 PM
Slider కవి ప్రపంచం

తాళంవేత అనంతరం

#Sandhya Sutrave New

ఈ తాళంవేత లో

రక్షక భటులు రక్షిస్తున్నారు

పారిశుధ్ధ కార్మికులు శుభ్రం చేస్తున్నారు

వైద్యులు సేవలందిస్తున్నారు

అందరు కరోనా భయానికి

కలుగులో ఎలుకలయ్యారు

కరోనా కట్టుబాట్లు పాటిస్తూ

అవసరార్థం బయటికొస్తున్నారు

పని ముగించుకొని పరిశుధ్ధమవుతున్నారు

అయినా ఆకతాయిలు

బైటికొస్తూనే ఉన్నారు

పోలీసువ్యవస్థకు సవాల్ విసిరి

పరిహారం పొందుచున్నారు

నేటిలాక్డౌన్ లోమనం చేస్తున్న దొకటే

స్టేయింగ్ ఎట్ హోం

లాక్డౌన్ ఎత్తివేసాక రియల్ షో ఆరంభం

పహారా కాసిన పోలీసులు  మనకడ్డు చెప్పరు

మనకు మనమే పహారా కావాలి

ఇప్పటి పధ్ధతులు కొనసాగించాలి

అవసరార్థం మాత్రమే బయటికెళ్ళాలి

కరోనా కాటు ఎక్కడినుండి ఎలా ఎందుకు ఎప్పుడు

వస్తుందో తెలియని స్థితిలో ఉంటాము

ఎవరిని ఆహ్వానించలేము

ఎవరి ఆతిథ్యం పొందలేము

ఏ వాహనం ఎక్కాలన్నా

ఎవరితో మాట్లాడాలన్నా

అనుమానం భయంతోదహించుకుపోతాం

ఈ లాక్ డౌన్ ప్రశాంతత అప్పుడు ఉండదు

ఆకతాయి తనానికి కోరిక ఉండదు

నిరంతరం అతి జాగ్రత్తగా ఉంటూ

మనల్ని మనమే రక్షించుకొందాం

కరోనాకు వాక్సిన్ వేయించుకుందాం

ఈ కంటిన్యూవస్ అన్సీన్ కార్డ్ లెస్

కరోనా కండక్టివిటీ చైన్ ను కట్ చేద్దాం

మనం కరోనా సమరంలో గెలుద్దాం

ఎప్పటిలాగానే మానవుడే విజయుడందాం

సంధ్య సుత్రావె, పాత నగరం, హైద్రాబాద్,500065

Related posts

శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం

Bhavani

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Satyam NEWS

విజిల్: సౌదీలో పర్మిట్ లేకుండా భారతీయుల బంగారం వ్యాపారం

Satyam NEWS

Leave a Comment