27.7 C
Hyderabad
April 20, 2024 00: 40 AM
Slider కవి ప్రపంచం

ప్రేమయే

#Manjula Surya New

మంచుబిందువు సూర్యుని వేడికి

ఆవిరైనట్లు

అనురాగాలు వేడిప్రకోపంలో

దగ్ధమవవుతాయా

ఒకవేళ అలా జరిగినా

గుండెనిండా వేళ్లూనుకున్న

పచ్చనిచెట్టులా ప్రేమ నిండిఉంటే

ప్రాణవాయువై మళ్ళీ పలకరించదా

కెరటాల హోరు జోరు ఎంత ఉన్నా

తీరాన్ని ముద్దిడాలంటే

పొగరు వగరు తగ్గించుకోవాల్సిందేగా

మేఘుడెంత దూరంలో ఉన్నా భూమిని

కనిపెట్టుకుని ఉంటాడుగా కంటికి రెప్పలాగా

గుండెనంతా కరిగించినట్లు

కురిపిస్తాడుగా వర్షంలాగా

ఒక్కటే అనే భావనలో

మనం అనే భావన వనంలా కొలువుదీరి ఉంటే

అహానికి అస్తిత్వమే  ఉండదు కదా

ఎంతగా మనసు అర్థమయినా

రూపాంతరం చెందే వైరస్ గుర్తొచ్చినప్పుడల్లా

పరిశోధన తప్పదేమో

మనిషి ఆలోచనలు అంతరిక్షంవైపు సాగుతున్నా

మనసు అంతరంగం అర్థం కాకుంటే

గ్రహాలు కూడా ఉపద్రవాన్ని తెచ్చిపెట్టవా

అంకురం చాలుగా అల్లుకుపోవడానికి

గుండె గుబాళిస్తే చాలుగా అవ్యక్తమై

అది కళ్ళలో ప్రతిఫలిస్తే చాలుగా వ్యక్తమై

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

శ్రీశైలం ఘాట్ రోడ్డులో అటవీశాఖ నిలువుదోపిడి

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

Satyam NEWS

బేషరతుగా కలిసి పని చేస్తున్న జనసేన బిజెపి

Satyam NEWS

Leave a Comment