27.7 C
Hyderabad
April 26, 2024 05: 12 AM
Slider కవి ప్రపంచం

పవిత్ర ఉగాది

#tumma janardhan new

యుగ యుగాలకు ఆది

నవ యుగాలకు పునాది

కొత్త చిగురుల తిథి

సరికొత్త రీతుల అతిథి

ప్లవనామ వత్సరం

పవిత్ర ఉగాది ఉత్సవం.

షడ్రుచుల సమ్మేళనం

ఆనందాల ప్రస్థానం

అనుబంధాల గమనం

సంతోషాల అంబరం

ఆస్వాధన మధురం

నవోత్సాహ సంబరం.

ద్వాదశ రాశులు నవగ్రహ శాంతులు

తొలగాలి భ్రాంతులు వెదజల్లాలి జ్ఞాన కాంతులు

నిత్య కళ్యాణమై నిండాలి మనసులు

పచ్చ తోరణమై పండాలి పూజలు

పెరగాలి ప్రేమలు అలగాలి అలకలు

చిలకాలి అనురాగాలు పలకాలి చల్లని పలుకులు

సంబంధ బాంధవ్యాలు సుందర మకరందాలై

వెల్లివిరియు వేళ మురిసె తెలుగు నేల

ప్లవనామ పవిత్ర ఉగాది శుభవేళ.

తుమ్మ జనార్దన్, దిల్ సుఖ్ నగర్, రంగారెడ్డి జిల్లా, చరవాణి 9440710501

Related posts

ఏపిలో పెట్టుబడులకు ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి

Satyam NEWS

కరోనా బాధితులకు పండ్లు కూరగాయల పంపిణీ

Satyam NEWS

రేవంత్ అరెస్టుకు నిరసనగా సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

Leave a Comment