28.7 C
Hyderabad
April 20, 2024 07: 32 AM
కవి ప్రపంచం

యువతరం

#Balu Kattula

యువత తల్చుకుంటే సాధ్యం కానిది లేదు..

తెగింపుకైనా సాధించుటకైనా..

సమరానికి అయినా యుద్దానికి అయినా..

అలాంటి యువత నేడు పక్కదారి పట్టి పరేషాన్ అవుతున్నారు

చెడు అవాసలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు

ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని ఆకాశానికి నిచ్చెనలు వెయ్యాలి

ఒక్కరిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త పుంతలు తొక్కాలి

ఒక్కరి ప్రేరణ పొంది గెలుపు బాటలు వెయ్యాలి

ఒక్కరిని అనుసరించి అవధులు లేని ఎత్తుకు ఎదగాలి కానీ….

నువ్వు పొద్దంతా కష్టం జెసి ఎంత సంపాదించిన అంతే వృద్ది

ఎదుటి వ్యక్తి ఆయాసం లేకుండా సంపాదించిన అంతే అభివృద్ధి

వాడు తినడ అంటే తింటాడు తాగుతాడు ఖర్చు చేస్తాడు నీకు వలే..

అయినా దినదిన వృద్ధిలో వాడు.

ఒడ్డుకు పడ్డ చేపపిల్ల లెక్క  నువ్వు

కుడితిలో పడ్డ ఎలుక లెక్క నీ బతుకులు

ఎవడు పుట్టగానే ధనవంతుడు కాలేదు

కష్టేఫలి అన్నారు గాని

రాతేఫలి అనలేదు…

ఎక్కడ ఉంది వ్యత్యాసం

ఎక్కడ ఉంది లోపం.. వెతుకు అన్వేషించి బతుకు పోరాటంలో గెలువు

పాత చింతకాయ పచ్చడిలా పాత కాలపు  ఆలోచనలు మానుకో..

ఆలోచనలు మారాలి విధానాలు మారాలి

నీ కోసం నీ ఆత్మగౌరవం కోసం బతుకు

మరొకరి ఉనికి కోసం నీ ఉనికిని తాకట్టు పెట్టకు…

తల్చుకుంటే దేశ తల రాతనే మార్చవచ్చు….

మత్తు వదిలి మరో చరిత తిరగ రాయ్..!!

బాలు కత్తుల, లింగ వారి గూడెం, సంస్థాన్ నారాయణపురం, యాదాద్రి జిల్లా, 9676219655

Related posts

ఊ(ఓ)ర్మిళ

Satyam NEWS

స్మరణ

Satyam NEWS

మొంబత్తి

Satyam NEWS

Leave a Comment