24.7 C
Hyderabad
March 29, 2024 07: 14 AM
కవి ప్రపంచం

తొలి పండుగ

#Gorrepati Srinu

భానుడి తొలి ఉషోదయకాంతులతో ఆనందాలు వెల్లివిరుస్తుండగా ..

నవ్య చైతన్యాలకు నెలవుగా మారి అరుదెంచే ..

తెలుగు వారి ప్రియమైన పండుగ..ఉగాది !

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం తో..

తొలిపండుగగా జనులందరిచే జరుపుకోబడుతుంది.. ఉగాది !

వసంత రుతువు ఆగమనంతో..

కోయిలమ్మలు కమ్మని మావిడిపూతలు తింటూ..తీయని రాగాలు ఆలపిస్తుంటే..

తెలుగు లోగిళ్ళులో..పిల్లాపాపలు నూతన వస్త్రాలు ధరించి ఆటలాడుతూ అల్లరిచేస్తుంటే..

మామిడి తోరణాలతో గుమ్మాలని మహిళలు అందంగా అలంకరిస్తుంటే..

అరుదెంచే విశిష్టమైన తెలుగువారి పండుగ.. ఉగాది !

పెద్దలందరూ ఒక్కచోట చేరగా..

పంచాగ పఠనాలతో జ్యోతిష్య పండిత శ్రేష్టులు భవిష్యత్ ఎలా వుంటుందో చెబుతుంటే..

అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ..సత్ సంకల్పంతో తొలిసారిగా పనులను ప్రాంభించే శుభదినం.. ఉగాది !

ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమై..

జీవితంలో పరిచయమయ్యే వివిధ అనుభవాలకు ప్రతీక గా నిలుస్తుంది !

ప్రేమ ఆప్యాయతలకు నెలవైన తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ..

మనమంతా కలసి జరుపుకునే పండుగ ఉగాది !

గొర్రెపాటి శ్రీను, హైదరాబాద్, 9652832290

Related posts

తెలుగు బావుటా

Satyam NEWS

సంక్రాంతి సోయగాలు

Satyam NEWS

బోనాల పండుగ

Satyam NEWS

Leave a Comment