38.2 C
Hyderabad
April 25, 2024 11: 42 AM
Slider కవి ప్రపంచం

శ్రీ ప్లవ వత్సర కాంక్ష

#Sandhya Sutravey

యుగానికి ఆది,

కొత్త  సంవత్సరాది

ఆమని ఆరంభంలో

తెలుగువారికి తేనెలొలుకు

కోరికల కొత్త కోకిలరాగం,

ఈ సంవత్సరం

గత శార్వరి లోని వరీని

విడిచి పేరుకు తగ్గట్టు

శ్రీ ప్లవనామ సంవత్సరం

జ్ఞానం తెలివితో కూడిన

బతుకు నివ్వాలి

ఈ కరోనా కట్టడి లో

గతంనుండి నేటిదాకా

ఎవరితో చేతులుకలుపక

సహజీవనం చేస్తున్నాం

ఈ  సంవత్సరం

సంతోషాలు తెప్పగా రావాలి

ఉగాది పచ్చడి షడ్రుచుల

ఆస్వాదంలా మంచిని ఆసాంతం

సొంతం చేసుకోవాలి

మనలోని సమస్యలు తొలగి

మావి చిగురులా కొత్త ఆశలతో

కరోనా మహమ్మారి నుండి

ఈ జగతికి ముక్తి కలగాలి

ఇదే కాంక్షతో,ప్లవనామ ఉగాదికి

సాదర స్వాగతం పలకాలి

సంధ్య సుత్రావె, పాత నగరం, సుల్తాన్ షాహి, హైద్రాబాద్

Related posts

“క్రాక్” సినిమాలో మాదిరిగా మిస్సింగ్ కేసును ప‌ట్టుకున్న డీఎస్పీ….!

Satyam NEWS

టై అప్:అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో న్యూజిలాండ్

Satyam NEWS

జమ్మలమడుగు ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment