38.2 C
Hyderabad
April 25, 2024 12: 50 PM
Slider కవి ప్రపంచం

వీడ్కోలు

#Manjula Surya New

శార్వరీ నీకిక సెలవు మరి

మా మనసుల్లో కొలువై

మా జీవితాలకు వెలుగై

మధురానుభూతిని మిగులుస్తావనుకుంటే

ఉషస్సులో కూడా చీకటిని మిగిల్చిన ఘనకీర్తి నీది

నీ జ్ఞాపకపు పుటలను తరిచి చూస్తే

అన్నీ ఆకలి కేకలే అన్నార్తుల ఆక్రన్దనలే

మర్యాదరామన్నలా గడప దాటని రోజులే

ఊపిరే ఉరితాడులా మారుతుంటే

ప్రాణభిక్షకు నోచుకోని శిక్షను అనుభవిస్తూ

తనువు చాలించిన కాయాలే

ఇంత జరుగుతున్నానువ్వు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతివి

నీ కర్తవ్య నిర్వహణే ధ్యేయంగా సాగిపోతివి

మా చిరునవ్వులనే గల్లంతు చేస్తివి

చిరు వ్యాపారులకు

చిరునామాయే లేకుండా చేస్తివి

సాయం ఎలాగూ లేదు

సానుభూతికి కూడా నోచుకోని

అభాగ్యజీవులలా వదిలేస్తివి

నీ కఠినవైఖరి క్రమశిక్షణ నేర్పేదిగా కాక

పగ పట్టినట్లుగా ఉంది

మనిషి వింత పోకడలకు వైద్యం చెయ్యాలే కానీ విషాన్ని ఎక్కిస్తానంటే ఎలా

అందుకేనేమో  ఈ వీడ్కోలు

ఒకింత ఆశాజనకమయ్యింది

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

కరోనా హెల్ప్: దళిత వాడల్లో బియ్యం బస్తాలు పంపిణీ

Satyam NEWS

వరంగల్ జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ దారుణ హత్య

Bhavani

ఆదర్శ గ్రామాలకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు

Satyam NEWS

Leave a Comment