28.7 C
Hyderabad
April 20, 2024 06: 16 AM
Slider కవి ప్రపంచం

వెలుగురేకై పల్లవించాలి

#Puli Jamuna

సమాజ జీవన గమనంలో

సగటు మనిషి జీవితంలో

కనీవినీ ఎరుగని కలవరమేదో

మదిలో అలల్లా చెలరేగి

నిరాశాంధకారం అలముకుని

అల్లుకున్న ఆశలన్నీ చెల్లాచెదురైనాయి

చింతలన్నీ చెంతచేరి వంత పాడగా

ఆనందాలన్నీ ఆవిరవుతున్న వేళ

ప్రకృతి విన్నూత్న సొబగులనద్దుకుని

సప్తవర్ణ శోభితంగా అలరారుతూ

ప్లవ నామవత్సర ఆగమన తరుణమైనా

శృతి తప్పిన గమకములను సవరించి

చైతన్య రాగమాలపిస్తూ నవోన్మేష శోభతో

ఆమని పులకింతయై అందాలు చిందిస్తూ

ఎద నిండా సంతోష సౌరభాలు వెదజల్లాలి

హృదిలోని అమవస చీకట్లను తరిమివేస్తూ

తొలిపొద్దు వెలుగులకై వేచి చూడాలి

కొంగ్రొత్త ఆశలను ప్రోది చేసుకుంటూ

ప్రేమానుబంధాల పలకరింపులతో

ఆత్మీయానురాగాలను పంచుకోవాలి

ప్లవ నామ వత్సరమైనా శాంతిని కలిగించి

మనసున మమతల హరివిల్లై విరిసి

నవ జీవన కాంతితో కళకళలాడే

వెలుగురేకై పల్లవించి వెలుగులు పంచాలి

పచ్చటి చెట్లకు నెలవైన ప్లవనామ వత్సరమా

వెచ్చటి కన్నీటిని తుడవగా వడివడిగా రావమ్మా

చీకటి ముసిరిన బతుకులలో వెలుగుల వేదికలా

సరికొత్త ఆశలకు వారధిలా రావమ్మా వసంతలక్ష్మీ

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682.

Related posts

అభివృద్ధి పనులు చేయడంలో రాజీ ప్రసక్తి లేదు

Satyam NEWS

భారతమ్మ ముద్దు బిడ్డ

Satyam NEWS

భార్తను హత్య చేసిన భర్త

Bhavani

Leave a Comment