27.7 C
Hyderabad
April 19, 2024 23: 27 PM
Slider కవి ప్రపంచం

ప(ప్ల)వనం

#C S Rambabu

శార్వరి శాలువా కప్పుతుందనుకున్నాను

కొరోనాను కానుకిస్తుందనుకున్నామా

వచ్చేది ప్లవనామ సంవత్సరం

ప్రవచనమంత హాయిగా ఉంటుందని ఆశపడుతుంటే

వైరస్ బరువుతో ఉగాది ఊగిపోతూ కదిలిపోతోంది

అయినా వెన్నుపోట్లనే నిభాయించుకుంటున్నాం

ఆటుపోట్లో లెక్కనా

జీవితమంతా లెక్కలేసుకుంటూ

బతికేటోళ్ళం

మాయదారి వైరస్సు శిరస్సులను ఖండించే ఖడ్గంలా

ఎంతపని చేసింది

పండగలు పబ్బాలులేక

చుట్టాలు పక్కాలులేక

కలుగులో ఎలక జీవితమయిపోయింది బతుకని

బాధపడ్డామో లేదో

బాధే సౌఖ్యమనే భావన రానీయమన్న కవి వాక్కు గుర్తుకొచ్చి నవ్వుకున్నాను

క్షణభంగురమే జీవితం మర్చిపోకన్న సూక్ష్మకణం

నాలోకి నేను తొంగిచూసుకోమని హితబోధ చేసింది

ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అనే మాటలు ఆకర్షించటం మానేశాయి

కోకిల స్వరంతోనో

షడ్రుచుల పచ్చడితోనో నిన్ను సరిపెట్టుకుంటాను

‘ప్లవ’తో పవనాలు మారనప్పుడు

ఉగాది నువ్వు అతిథివే కానీ

ఆపద్బంధువువి కాదు

ఏమీ అనుకోకు

నీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలకలేక

గతం గోడలపై చెరగని జ్ఞాపకాలను తడుముతున్నాను

సి.యస్.రాంబాబు

Related posts

ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్‌’ వేరియంట్‌గా ప్రకటించిన WHO

Sub Editor

ఢిల్లీ కోర్టులో కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సహా నలుగురు దుర్మరణం

Sub Editor

వైకాపా బుక్ లెట్స్ పై మహానుభావుల ఫోటోలు, కొటేషన్లు తొలగించండి

Satyam NEWS

Leave a Comment