30.7 C
Hyderabad
April 19, 2024 07: 53 AM
Slider సంపాదకీయం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా సత్యం న్యూస్

#masterplan

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా నిలిచింది సత్యం న్యూస్. రైతు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు జనబాహుళ్యానికి అందించిన సత్యం న్యూస్, వారి మనోభావాలకు అద్దం పట్టింది. 50 రోజులుగా రైతుల వెన్నంటే ఉండి వారి మనోవేదనను దేశ ప్రజలకు అందించింది. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆందోళన ప్రారంభించిన నాటి నుంచి వారి వెన్నంటే నడిచి చివరకు రైతులతో బాటుగా విజయాన్ని ముద్దాడింది సత్యంన్యూస్.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ, రాజకీయ నాయకులు రైతు జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపించడంలో సత్యంన్యూస్ తన వంతు పాత్ర పోషించింది. ఉద్యమకాలంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల కన్నీళ్లు తుడిచిన నాయకులకు సత్యంన్యూస్ తనవంతు ప్రోత్సాహం ఇచ్చింది.

రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూసినవారి కుట్రలను బాహ్య ప్రపంచానికి వెల్లడించడంలో తన వంతు కృషి చేసిన సత్యం న్యూస్ కు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ధ్యాంక్స్ చెప్పారు. అలాగే పోరాటంలో విజయం సాధించిన రైతులకు సత్యం న్యూస్ అభినందనలు తెలుపుతున్నది.

Related posts

అరుణాచలం గిరి ప్రదర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Bhavani

అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Bhavani

మేయర్ పదవి రాకపోవడంతో అసంతృప్తిలో విజయా‘రెడ్డి’

Satyam NEWS

Leave a Comment