38.2 C
Hyderabad
April 25, 2024 14: 09 PM
Slider సంపాదకీయం

Save Amaravati: ఇప్పటికైనా మనసు మార్చుకోండి

#jagan

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పై ఇప్పటికైనా విషం చిమ్మడం ఆపుతారా? ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ విషయం చిమ్మడం ఆపుతుందని ఎవరూ అనుకోవడం లేదు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే మహాపాదయాత్రకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందున ఇక కింది స్థాయి వారు అడ్డూఆపూ లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవడానికి అన్ని రకాల వ్యూహాలు పన్నారు. పోటీ యాత్రలు కూడా పెట్టారు. అమరావతి ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత పోటీ శిబిరాలు ఏర్పాటు చేసిన అధికార పార్టీ అభాసుపాలు అయింది.

అలాగే పోటీ యాత్రలు చేసి కూడా ఉన్న పరువు పోగొట్టుకున్నది. అమరావతి రైతులు తమకు అన్యాయం జరిగిందని చెబుతుంటే వారు చెప్పేది ఏమిటో కూడా వినకుండా వారిని అణచి వేస్తున్నారు. తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చి దాన్ని ప్రభుత్వం అభివృద్ధి పరచిన తర్వాత అందులో వాటా తీసుకోవడం ఏ విధంగా అన్యాయం అవుతుందో అర్ధం కావడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు అంటూ రైతులను అవమానించడం కూడా వైసీపీ క్రమం తప్పకుండా చేస్తున్నది.

తమ భూములకు విలువ పెరగాలని అనుకోవడం రియల్ ఎస్టేట్ ఎలా అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అమరావతి రైతులపై విద్వేషం రగిల్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న అధికార వైసీపీ వారి సమస్యను పరిష్కరిస్తే సరిపోతుంది కదా? అమరావతి రైతులను అసలు శత్రువులుగా ఎందుకు పరిగణిస్తున్నారు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం రాదు. అమరావతిని అభివృద్ధి చేసి అక్కడ ఉన్న భూములను వివిధ రంగాల సంస్థలకు కేటాయించి ఉంటే ఈ మూడేళ్లలో ఏపి ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అభివృద్ధి చేసిన భూముల విలువలు పెరిగితే ఎంతో మంది లాభపడి ఉండేవారు. ఆ లాభంలో అధికార పార్టీ వారికి కూడా వాటా వచ్చి ఉండేది.

ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో మంచి పేరు వచ్చి ఉండేది. అయితే ఆయన ఆ విషయాల నుంచి ఆదిలోనే పక్కకు వెళ్లిపోయారు. అమరావతి రైతులపై కక్ష సాధించేందుకు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించడం లేదనే అపవాదును కూడా ఎదుర్కొనడానికి సిద్ధపడ్డారు తప్ప అమరావతి అనే పేరునే ఉచ్ఛరించడం లేదు. ఇక అమరావతిని అభివృద్ధి చేయడం అనేది ఎంతో దూరపు మాట.

అమరావతిలో రోడ్లను తవ్వేసి కంకర అమ్ముకునే వారిని కూడా పోలీసులు పట్టుకోవడం లేదు. రోడ్లన్ని తవ్వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు ఇదేమిటో ఎవరికీ అర్ధం కాదు. రోడ్లను తవ్వి కంకర అమ్ముకోవడం ఏమిటి? తెలియదు. ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేదు కాబట్టి కొందరు రోడ్లు తవ్వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేదు కాబట్టి వారిని పట్టుకోరు… అంతే.

ఈ తరహాలో పాలన ఉంది కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. ఏదీ చట్టబద్దంగా చేయడం లేదు కాబట్టే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇది గమనించి ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతి రైతుల మహాపాదయాత్రను సజావుగా సాగనివ్వాలి. అడ్డంకులు సృష్టించకుండా ఉండాలి. రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పిన ఏడు నెలలకు సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయడం లాంటి పనులు ప్రభుత్వంపై మరింత అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి. కాలయాపన చేయడం కరెక్టు కాదు.

మూడు రాజధానులకు ‘‘చిన్న చిన్న న్యాయ సమస్యలు’’ ఉన్నాయని, అవి త్వరలోనే సమసి పోతాయని ప్రభుత్వ పెద్దలు ఈ మధ్య కాలంలో చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి ముందుగానే వారికి ఎలా తెలిసిందో తెలియదు కానీ తాజాగా సుప్రీంకోర్టులో అందుకు అనుగుణంగా మాత్రం జరగలేదు. కాలయాపన చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం ఇప్పటికైనా ఆపితే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది.

Related posts

సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా: చంద్రబోస్

Bhavani

ముదిమి వయస్సు లో..భూమి కోసం ఆరాటమైన పోరాటం… !

Satyam NEWS

మైనారిటీలంతా దుష్ట వైసీపీకి గుణపాఠం చెప్పాలి

Bhavani

Leave a Comment