37.2 C
Hyderabad
March 29, 2024 19: 17 PM
Slider వరంగల్

గో మాత ను రక్షిoచుకోవడం మన హక్కు, మన బాధ్యత

#bjp mulugu

గోవులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి కోరారు.

ఈ రోజు ములుగు  జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెవైయం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, సంప్రదాయలలో ఒక భాగమైన గోవును అందరూ పూజించాలని కోరారు.

ఆవును హిందూ ధర్మానికి ఒక ప్రతీక గా అను నిత్యం పూజించడం ఆనవాయితీ అని అన్నారు. అయితే ఈ నెల బక్రీద్ సందర్భంగా  అనేక వాహనాలలో వేలాది గోవులను అక్రమంగా  చత్తీస్గడ్ నుండి ములుగు గుండా  హైదరాబాద్ కు  తరలిస్తున్నారని ఆయన అన్నారు.

ములుగు జిల్లాలో  గోవుల  వ్యాపారం నడిపిస్తున్న వారిపై  పోలీస్ యంత్రాంగం  ప్రత్యేక దుష్టి పెట్టాలని అన్నారు.  పేరుకు చెక్ పోస్టులు పెట్టినప్పటి కి చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న కారణంగా నిన్న ములుగు జిల్లా కేంద్రంలో యువమోర్చా ఆధ్వర్యంలో  2 లారీలలోని వందలాధి  అవులను  పట్టుకున్నామని తెలిపారు.

గోవుల అక్రమ రవాణా పై కఠినమైన నిర్ణయం తీసుకోని ఈ రవాణా వ్యవస్థను నియంత్రించాలని  అన్నారు. అలాగే  వారాంతపు సంతలలో గోవులను అమ్మే  పాత, కొత్త దళారుల పై నిఘా పెడితే అక్కడనే అడ్డుకట్ట వేయచ్చు అని అన్నారు. గోవులను అక్రమ రవాణా చేస్తే  బిజెపి పార్టీ తరపున  అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ములుగు జిల్లా అధికార ప్రతినిధి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్ కోశాధికారి కొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర కిషోర్ నాయక్    జిల్లా ప్రధానకార్యదర్శి సానికొమ్ము హరీష్ రెడ్డి  మండల ప్రధానకార్యదర్శి కోయిల కవిరాజు బిజెవైయం జిల్లా నాయకులు సానికొమ్ము శ్రీనాధ్ రెడ్డి   శీలం దినేష్  తదితరులు పాల్గొన్నారు

Related posts

బిచ్కుందలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

Satyam NEWS

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించాలి

Sub Editor 2

వనపర్తిలో గుడి కూల్చివేత వద్దు

Bhavani

Leave a Comment