27.7 C
Hyderabad
March 29, 2024 02: 52 AM
Slider మహబూబ్ నగర్

సేవ్ అజ్: కరోనా నుంచి ప్రభుత్వం రజకులను కాపాడాలి

dobhi workers

కరోనా వైరస్ నుండి రజక, సేవా వృత్తిదారుల రక్షణకు ప్రభుత్వం వెంటనే మాస్కులు అందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ కోరింది. ఆసుపత్రిలో అన్ని వార్డులో వినియోగించిన బెడ్ షీట్లు, కర్టెన్లు ఉతికే దోబీల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేని కమిటీ అభిప్రాయపడ్డది.

ఇంటింటికి వెళ్లి బట్టలు ఉతికే వారు తగు జాగ్రత్తలు వహించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నాగర్ కర్నూలు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పి భాస్కర్ కోరారు. సేవావృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 500 కోట్ల నిధులను కేటాయించినా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడంలో విఫలమైందన్నారు. ప్రైవేట్ మెడికల్ యాజమాన్యాలు పది రూపాయల ఉన్న మాస్క్ లను  80 నుంచి 100 రూపాయల వరకు అమ్మీ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రం అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ నిర్ధారణ తెలుసుకుంటే ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి సులువుగా ఉంటుంది అన్నారు. పట్టణ గ్రామ స్థాయిలలో కరోనా వ్యాధిని నిరోధించడానికి అధికారులచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

అక్కడే మాస్కులు, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వాలని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను, వృత్తిదారుల రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

పైడితల్లి అమ్మా.. సీఎం జ‌గ‌న్ కు మంచి జ్ఞానం ప్రసాదించు

Satyam NEWS

క‌ల‌క‌లం సృష్టిస్తున్న యువ‌తి మృత‌దేహం…!

Satyam NEWS

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం

Satyam NEWS

Leave a Comment