నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యురేనియం కార్పొరేషన్ ముందుకు ఉరుకుతుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన యువత దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను యువత ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై సోషల్ మీడియా ద్వారా యువత నిరసనలు పెద్ద ఎత్తున తెలుపుతున్నారు. గతంలో మాదిరిగా ధర్నాలు,రాస్తారోకోలు కాకుండా మారుతున్న జనరేషన్ కు తగ్గట్టుగా టెక్నాలజీ ని వాడుకుంటున్నారు. నల్లమల జిల్లా బిడ్డలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా పోరాటం చేయడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. వెనుకబడిన జిల్లా అని, వెనుకబడిన ప్రాంతమని, వెనుకబడిన మనుషులని చిన్న చూపు చేసే వారికి నల్లమల యువత సోషల్ మీడియా ద్వారానే బదులిస్తున్నారు. జిల్లా ప్రజలు, యువత వారి వృత్తిని కొనసాగిస్తూ ఎవ్వరికి ఇబ్బందులు కలుగచెయ్యకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలను వారు వ్యతిరేకిస్తున్నారు. సరికొత్త రీతిలో నల్లమల్ల తవ్వకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని నల్లమల ప్రాంతం పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. నల్లమల అంటే మాకు ప్రేమ అంటూ ప్రభుత్వానికి తెలియచేస్తున్నారు. నల్లమల అటవీ అందాలను స్టేటస్లో చిత్రీకరించి దాన్ని చెడగొట్టే యురేనియం తవ్వకాలపై అభ్యంతరాలు తెలియచేస్తున్నారు. ఎవ్వరి స్టేటస్ చూషిన సేవ్ సేవ్ నల్లమల్ల అంటూ నినాదాలు కనిపిస్తున్నాయి. యువత చైతన్య వంతంగా ఉండటంతో యురేనియం తవ్వకాలకు ఎవరు వచ్చినా పలాయనం చిత్తగించాల్సిందే. రాజకీయాలకు అతీతంగా యువత ఉండటం కూడా చాలా మందికి మింగుడు పడటం లేదు.
previous post