27.7 C
Hyderabad
March 29, 2024 04: 55 AM
Slider కృష్ణ

దేవాలయాలపై దాడులను ఆపాలని ధర్మ పరిరక్షణ జైత్రయాత్ర

#DharmaPracharaParishad

ధర్మ పరిరక్షణ పట్ల ప్రజల్లో జాగృతి కోసం శ్రీ శ్రీ శ్రీ విద్యా శంకర్ భారతి స్వామి వారు విజయవాడ లో జైత్రయాత్ర నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతులు అభినవోద్దండ శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతిస్వామి వారు, దేవాలయ ధర్మపరిరక్షణ సమితి ఆంధ్రపదేశ్ ప్రతినిధి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, కంచికామకోటి పీఠం ఆస్థాన పండితులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, ధార్మికవేత్త కామేశ్వరశర్మ, సమితి కోశాధికారి నరేష్ కులకర్ణి, సంయుక్త కార్యదర్శి దర్శనపు శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హైందవ ధర్మం పట్ల అవహేళన, అవమానకర ధోరణి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో దేవాలయంలపై కుట్రపూరితంగా దాడులు జరుగుతున్నాయి. ఇది రాజకీయ క్రీడగా మారుతున్న సమయంలో దిశా నిర్ధేశం చేసేందుకు స్వామి వారు జైత్రయాత్ర సాగిస్తున్నారు.

శృంగేరి పీఠం జగద్గురు సందేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయంలపై జరిగే దాడులకు కారణం అయిన వారిని గుర్తించకపోవడం దారుణం. ఈ దాడులు మహా పాపాలు కాకుండా దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి.

శ్రీ శ్రీ శ్రీ విద్యా శంకర్ భారతి స్వామి వారి సందేశం

ఉభయ రాష్ట్రాలలో ధర్మాన్ని పరిరక్షించేందుకు చేసే జైత్రయాత్రలో మావాణి హైందవ వాణిగా భావించాలి. దేవాలయంలను విధ్వంసం చేయడమే దుర్మార్గపు చర్య. రాష్ట్రంలో ధర్మంను పునప్రతిష్ఠ చేసేందుకు జైత్రయాత్ర చేస్తున్నాము. దేవాలయంలపై జరిగే దాడుల్లో   నిందలు అనుభవించేది ఒక పక్షం.. తప్పించుకొని తిరుగుతుంది మరొక పక్షం.. నిందలు భరించే వారి ప్రాణం విలవిలాడుతోంది.

ప్రతి హిందువు దాడులు చేసి తప్పించుకొని తిరుగుతున్న వారిని గుర్తించాలని.. దేవాలయము చుట్టూ ఎంతోమంది యువకులు ఉన్నారు.. వీరంతా బాధ్యతగా ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతోంది అనేది బ్రహ్మ దేవుడు తప్ప ఎవరూ చెప్పేలేరు పోలీసులు కాపలా ఉండాలి అనేది సమంజసం కాదని మా జైత్రయాత్రలో ప్రభుత్వం సహాయం పరిపూర్ణంగా కోరుతున్నాము.

మాకు కావాల్సిన ధర్మ పరిరక్షణ అనే ఆకలిని తీర్చాలని.. హిందూ మతంలో ఐక్యత లోపించింది.. ధార్మిక పరిషత్ ఏర్పాటు అనేది ముఖ్యమైన అంశం.

కంచి కామకోటి జగద్గురువు సందేశం

ముఖ్యమంత్రి తండ్రితో సమానం.. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి బాధ్యత వహించి ధార్మికను కాపాడటంలో చక్కటి బాధ్యత తీసుకుంటారు అని భావిస్తున్నాం. దేవాలయం రక్షణకు ప్రభుత్వమేది బాధ్యత అనేది కాకుండా మనం కూడా బాధ్యత వహించవల్సిందే ఆలోచన చేయాలి.

డిమాండ్లు

1.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన ‘ధార్మిక పరిషత్ ‘ ను సత్వరమే ప్రకటించాలి. హిందూ పీఠాలకు చెందిన ధర్మాచార్యుల నేతృత్వంలో ఇది ఏర్పాటుకావాలి. అత్యంత అవసరమైన అంశంగా ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి, అమలు చెయ్యాలి.

2.ఆలయాల్లో అన్యమతస్తులు ప్రచారం చెయ్యటాన్ని పూర్తిగా నిషేధించాలి. ఇతర మతాలకు సంబంధించిన నినాదాలు చెయ్యటం – పోస్టర్లు అతికించటం సహా అధునాతన సాంకేతిక విధానాలు ఉపయోగించే చేసే ఏవిధమైన ప్రచారానికి అనుమతించకూడదు. అటువంటి ప్రచారం చేసే వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి.

3.ఆలయాల్లో నిర్వహించే దుకాణాలు సహా అన్ని రకాలైన వ్యాపార సంస్థలను అన్యమతస్తులకు కేటాయించకూడదు. ఇవన్నీ పూర్తిగా హిందువులకే కేటాయించాలి.

4. ఆలయాల్లో అన్యమతస్తులు ఏవిధంగానూ. ఏరూపంలోనూ ప్రవేశించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి.

5. ఆలయాల మీద జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఆలయాలకు ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలి. అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగించి నిఘా వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి. ఈ చర్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన చెయ్యాలి.

6. ఆలయాల మీద జరిగిన దాడులకు సంబంధిత న్యాయస్థానాల్లో నడుస్తున్న కేసులను సత్వరమే పరిష్కరించి, దోషులను తీవ్రంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కరిన చట్టాలు రూపొందించి అమలు చెయ్యాలి. ‘దిశ’ చట్టం తరహాలో ఆలయాల పరిరక్షణకు సరికొత్త చట్టాన్ని కఠినమైన నిబంధనలతో రూపొందించి తక్షణమే అమల్లోకి తీసుకురావాలి.

7.ఆలయాల్లో నిఘా, భద్రతలకు సంబంధించి రాష్ట్ర వ్యాపితంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించేందుకు ఐ.పి.ఎస్ స్థాయి అధికారి విస్తృత అధికారాలు ఇచ్చి నియమించాలి.

8.దేవాలయాలకు సంబంధించిన మాన్యాలు , ఇతర ఆస్తుల వివరాలతో కూడిన కేంద్రీకృత వ్యవస్థను తయారుచెయ్యాలి. అలయాల ఆస్తుల పరిరక్షణ కూడా ఇందులో భాగం కావాలి. రాష్ట్ర వ్యాపితంగా ఉన్న దేవాలయాలకు చెందిన స్థిర , చర ఆస్తుల వివరాలు , ఇతర బంగారు వెండి ఆభరణాలు తదితర పూర్తి ఆస్తుల వివరాలతో ప్రభుత్వం వెంటనే శ్వత పత్రం విడుదల చెయ్యాలి.

9. దేవాలయాల మాన్యాలు ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో గుర్తించి వాటిని వెంటనే స్వాధీనపరచుకోవాలి.

10. ప్రతి దేవాలయానికి సంబంధించిన మాన్యాలు , ఇతర ఆస్తుల వివరాలు లెక్క తేల్చి , వాటి పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి.

11. ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాలకు సంబంధించిన ఖర్చులకే వినియోగించాలి.

30,31 తేదీలలో విశాఖలో

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 30,31 తేదీల్లో జైత్రయాత్ర కొనసాగుతుంది.

Related posts

కీలక మావోయిస్టు నాయకుడిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు

Satyam NEWS

ఆమనగల్ పట్టణంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

Satyam NEWS

మీటింగుల పేరుతో ఆదివాసీలను పీడిస్తున్న మావోయిస్టులు

Bhavani

Leave a Comment