32.2 C
Hyderabad
April 20, 2024 20: 36 PM
Slider నిజామాబాద్

వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి

#jukkal

మాదిగల న్యాయమైన ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వర్షాకాల పార్లమెంటు సమావేశంలో పెట్టి చట్టబద్దత కల్పించాలని తెలంగాణ మాదిగ జె ఎ సి జిల్లా యూత్ అధ్యక్షులు, జుక్కల్ నియోజకవర్గ ఇన్ ఛార్జి గంగాదర్ అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  తరతరాలుగా మాదిగలను కేంద్ర ప్రభుత్వాలు అణచివేతకు గురి చేస్తున్నాయన్నారు. తెలంగాణలో అతి  పెద్ద సామాజిక వర్గం కలిగిన మాదిగలకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

మాదిగల న్యాయమైన వాటా ఎస్సీ రిజర్వేషన్లను  పెంచాలన్నారు. జనాభా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు అందించాలన్నారు. ఎబీసీడీలుగా వర్గీకరించి అందరికీ సమానంగా ఎవరు ఎంత ఉంటే వారికి అంత రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.

అందులో భాగంగా పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాదిగ జె ఎ సి ఆద్వర్యంలో ఈ నెల 26, 27 తేదిల్లో ఛలో డిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మాదిగల న్యాయమైన ఆకాంక్షను సాధించుకునే వరకూ మాదిగ జె ఎ సి ఆద్వర్యంలో శాంతియుతంగా పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాదిగ జె ఎ సి నాయకు ఉన్నారు.

Related posts

టెనెంట్ ఫైర్:అమెరికా కాల్పుల్లో ఇద్దరు పోలీస్ ల మృతి

Satyam NEWS

జో బైడెన్ ఎన్నికతో పాకిస్తాన్ లో పెల్లుబికిన ఆనందం

Satyam NEWS

వనపర్తి మున్సిపాలిటీలో  పరిపాలన విఫలం

Satyam NEWS

Leave a Comment