28.7 C
Hyderabad
April 20, 2024 05: 25 AM
Slider గుంటూరు

ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న జగన్ రెడ్డి

#TDP NRT

ఎస్సీ, ఎస్టీ లపై యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలను వైసీపీ ప్రభుత్వం అదుపు చేయలేకపోతున్నదని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అదే సమయంలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజకీయాలకోసం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.

ఎస్సీ,ఎస్టీ చటాన్ని నీరుగారుస్తూ ఆ చట్టాలను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుని దేశంలో మరేక్కడ లేనటువంటి విధంగా నియంత పరిపాలన చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వేల వందల కోట్ల అక్రమ మైనింగ్ దందాలను, అవినీతిని తెదేపా నాయకులు బట్టబయలు చేస్తున్నారనే కక్షతో టిడిపి నాయకుల పై హత్యా ప్రయత్నంచేసి భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

అక్రమ దందాలను అవినీతి పనులను ప్రశ్నించకుండా ఉండేందుకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి వారి పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆయన తీవ్రంగా ఖండించారు.

దళితులకు రక్షణ కవచంలా ఉండాల్సిన ఎస్సీ ఎస్టీ చట్టాలను జగన్ రెడ్డి రాజకీయ కక్షల కోసం ప్రశ్నించే గొంతులను నులిమేయడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. దళితులను దళిత రక్షణ చట్టాలను నీరుగారుస్తున్నారని రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.దారు నాయక్ అన్నారు.

అబివృద్ది చేయటం చేతకాక ఉన్న సంక్షేమ పధకాలు రద్దుచేసి బెస్ట్ అవైలబుల్ స్కీం,విదేశి విద్య,ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ,లాండ్ పర్చేస్ స్కీం వంటి చట్టాలను రద్దుచేసి ఉన్న నిధులను అమ్మవడి పధకానికి మలుపుతూ ఎస్సీ ఎస్టీ ల పైన కక్ష సాదిస్తున్నారు.

గతంలో నకరికల్లు మండలం శివపురం తండా లో గిరిజిన మహిళను నరసింగపాడు గ్రామానికి చెందిన వై ఎస్ ఆర్ సి పి నాయకుడు దారుణంగా చంపితే తప్పుడు కేసులు పెట్టారు ఇప్పుడు వారు బయట తిరుగుతున్నారని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

అదే విధంగా రాజధాని అమరావతి ప్రాంతం లో దళితులు నిరసన తెలియ చేస్తుంటే వారి మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత ఈ ప్రభుత్వాన్నిదని నరసరావుపేట పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ అన్నారు.

ఈ సమావేశంలో రొంపిచర్ల మాజీ ఎంపీపీ మొండితోక రామారావు, నరసరావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కుమ్మెత కోటిరెడ్డి,ఎం.కోట నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కన్నవారి చెంతకు చిన్నారులు….

Satyam NEWS

హేట్స్ ఆఫ్: ఇలాంటి కలెక్టర్ ఒక్కడున్నా చాలు

Satyam NEWS

ములుగు  జిల్లా కేంద్రంలో తైక్వాండో పోటీలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment