కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా”కృష్ణవేణి సంగీత నీరాజనం” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారతదేశ సాంస్కృతిక గొప్పతనానికి గొప్ప వేదికగా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో 3 రోజుల పాటు 35 ప్రదర్శనలు ఉంటాయి. ఈ ప్రదర్శనలను140 మంది ప్రతిభావంతులైన కళాకారులు ఇస్తారు. ఇందులో అనుభవజ్ఞులైన మాస్ట్రోలు, వర్ధమాన ప్రతిభావంతులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమం 3 ప్రాంతాల్లో 3 వేదికల్లో జరుగుతుంది:
1. ఉత్సవాల ప్రధాన వేదిక తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం
2. 7వ తేదీ, దుర్గా ఘాట్, ఇక్కడ త్యాగరాజు పంచరత్న కృతులు ఉదయం 8:30 గంటలకు ప్రదర్శించబడతాయి
3. 8వ తేదీ, కనక దుర్గ ఆలయం, ఇక్కడ దేవీ కృతులు డిసెంబర్ ఉదయం 8:30 గంటలకు ప్రదర్శించబడతాయి
ప్రతి రోజూ ఒక ప్రత్యేకమైన సంగీత అనుభూతిని ఇది అందిస్తుంది:
1 వ రోజు (డిసెంబర్ 6) నాగస్వరం, హరికథ, గాత్ర కచేరీలు మరియు నామ సంకీర్తనతో సహా 11 ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి.
2 వ రోజు (డిసెంబర్ 7) పంచరత్నకృతులు, వేణువు పఠనాలు మరియు మరిన్నింటిని ప్రదర్శించే మరో 11 ప్రదర్శనలు ప్రదర్శించబడతాయి.
3 వ రోజు (డిసెంబర్ 8) దేవీ కృతిలు, మాండొలిన్ పఠనాలు మరియు త్యాగరాజ దివ్య నామ కృతిలతో సహా 13 ప్రదర్శనలతో ముగుస్తుంది.
ప్రసిద్ద తెలుగు స్వర కర్తల సహకారాన్ని పురస్కరించుకుని కర్ణాటక సంగీతంలోని సాహిత్య సౌందర్యాన్ని హైలైట్ చేస్తుంది. దీని ద్వారా, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశ సంప్రదాయాలతో ప్రేక్షకులను కనెక్ట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
కేంద్ర పెట్రోలియం & సహజవాయువు మరియు పర్యాటక శాఖల సహాయ మంత్రి సురేష్ గోపి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ & వైద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక, సాస్కృతిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. బాలాజీ, స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ పి. తేజస్వి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, తదితరాలు పాల్గొంటారు.
కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖచే ప్రత్యేక కార్యక్రమ నిర్వహణ..
ఎగ్జిబిషన్‌లో మంగళగిరి కాటన్, ఉప్పాడ జమ్దానీ, ధర్మవరం సిల్క్, పోచంపల్లి వంటి ఐకానిక్ చేనేత చీరలతో సహా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు చెందిన జీఐ తో ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు ఉంటాయి. కొండపల్లి చెక్క బొమ్మలు, కలంకారి పెయింటింగ్స్, నర్సాపూర్ లేస్, వుడెన్ కట్లరీ, లెదర్ పప్పెట్రీ వంటి క్రాఫ్ట్ వస్తువులు కూడా ప్రదర్శనలో ఉంటాయి. తిరుపతి లోని ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ వంటల వారసత్వాన్ని హైలైట్ చేస్తూ, సందర్శకులకు ప్రామాణికమైన ప్రాంతీయ రుచులను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తూ ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
అదనంగా, ఆంధ్రప్రదేశ్ టూరిజం రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల తెలిపే సమాచారాన్ని అందిస్తారు. సంగీతం, సంస్కృతి మరియు పర్యాటకం యొక్క సామరస్య సమ్మేళనం కృష్ణ వేణి సంగీత నీరాజన కార్యక్రమం . ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదను ప్రదర్శించడం ద్వారా రాష్ట్రంలో “మ్యూజిక్ టూరిజం”ని ప్రోత్సహించడం, సాంస్కృతిక ఔత్సాహికులకు ప్రధాన గమ్యస్థానంగా ఉంచడం ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ మూడు-రోజుల సాంస్కృతిక కోలాహలం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని భావించవచ్చు. దీనికి సంగీత ప్రియులు, సాంస్కృతిక అభిమానులు మరియు పర్యాటకులు తప్పనిసరిగా హాజరుకావాల్సిన గొప్ప కార్యక్రమం. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానెల్ ‘@ministryoftourismgoi’ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. మరిన్ని వివరాల కోసం సందర్శించండి: https://krishnavenimusicfest.com