28.7 C
Hyderabad
April 17, 2024 03: 53 AM
Slider కడప

స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి : సీఐటీయూ డిమాండ్

#citukadapa

స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు సి.రవి కుమార్ డిమాండ్ చేశారు. అఖిలభారత సమ్మెలో భాగంగా స్కీమ్ వర్కర్లు శుక్రవారం కడప జిల్లా రాజంపేట మాతా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మరియు జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ లు మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని, పిఎఫ్, ఈ ఎస్ ఐ మరియు గ్రాట్యూటీ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5లక్షలు తో పాటు వేతనం లో సగం పెన్షన్ కల్పించాలని, అలాగే కోవిడ్ తో మరణించిన స్కీం వర్కర్లకు రూ. 50 లక్షల బీమా అమలు చేయాలని, వ్యవసాయ నల్ల చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని అన్నారు.

కోవిడ్ విధులు నిర్వహిస్తున్న టీం వర్కర్లకు అదనంగా  రూ. 10 వేలు వేతనం ఇవ్వాలని, ఆధునిక ఆరోగ్య విద్య పోషకాహార సర్వీసుల ప్రైవేటీకరణ విరమింపచేసుకోవాలని అన్నారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని మరియు సార్వత్రిక ఆరోగ్య హక్కు కోసం చట్టం చేయాలని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను స్కీం వర్కర్లకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యకర్తలు ఎన్. శంకరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు ఈశ్వరమ్మ, శివరంజని, విజయ.. మునిసిపల్ కార్మికులు సి హెచ్ ఓబయ్య, ఎం. ప్రసాద్, డి. లక్ష్మీదేవి.. వి ఆర్ ఏ సంఘం శంకర్, మస్తాన్, నరసింహులు మరియు మండలం లోని స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు.

Related posts

విజయవాడలో బాలికపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

ఘనంగా సంతోషి మాత అమ్మవారికి పూజలు

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వ మోటార్ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో

Satyam NEWS

Leave a Comment