27.7 C
Hyderabad
April 25, 2024 10: 09 AM
Slider ముఖ్యంశాలు

ఒమిక్రాన్ నేపథ్యంలో ఏపీలో పాఠశాలలకు సెలవుల పొడిగింపు?

#coronaVirus

ఏపిలో పాఠశాలలు ఇచ్చిన సెలవులు పొడిగిస్తారా? కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణల పాఠశాలలకు ఈనెల 30 వరకూ సెలవులు పొడిగించడంతో.. ఏపీలో పాఠశాలలకు  సెలవులు పోడిగింపుపై విద్యాశాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై సోమవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ ఇప్పటికే 13.87 శాతానికి చేరడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికానందున పాఠశాలలు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు తర్జన బర్జన పడుతున్నారు. ఒకవేళ పాఠశాలలు కొనసాగిస్తే ఎక్కడైనా కేసులు వెలుగు చూస్తే ఏం చేయాలనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు.

Related posts

ప్రకృతి వైపరీత్యంతో తల్లడిల్లుతున్న రైతులకు అండగా ఉంటాం

Satyam NEWS

రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ కు ఎంపికైన చల్వాయి ఉన్నత పాఠశాల విద్యార్థి

Bhavani

గ్రామ అభివృద్ధి బాధ్యత మీదే: పెండింగ్ పనులన్నీ పూర్తి చేయండి

Satyam NEWS

Leave a Comment