34.2 C
Hyderabad
April 23, 2024 14: 08 PM
Slider శ్రీకాకుళం

బోన్ క్యాన్సర్ బారినపడిన చదువుల సరస్వతి

#Harika

చదువుల్లో ఆటల్లో ముందుండే ఆ పేద విద్యార్ధిని జీవితంలో ఎంతో సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే విధి మరోలా అనుకుంది. ఏడో తరగతి చదువుతున్న గంగాధర హారికకు బోన్ క్యాన్సర్ సోకింది. నిండు నూరేళ్లూ ఆనందంగా ఉండాల్సిన ఆ బాలిక ఇప్పుడు వైద్యం కోసం ఎదురుచూస్తున్నది.

కటిక పేదరికంతో పోరాడుతున్న తల్లిదండ్రులు జీవితంలో అలసి పోయారు. మరి ఆ పేద బాలికకు దిక్కెవరు? శ్రీకాకుళం రూరల్ మండలం  పెద్ద పాడు గ్రామం లోని పొందర వీధికి చెందిన గంగాధర హారిక పెదపాడు ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. చదువులలో ఆటల్లో మేటి అని ఉపాధ్యాయ సిబ్బంది తెలిపారు.

తల్లిదండ్రులు  పేదలు, రోజువారి కూలీలు. అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఎముకల క్యాన్సర్ అని తేలింది. వైద్యానికి లక్షలు అవసరమని డాక్టర్లు తెలపడంతో కుటుంబమంతా విషాదం నెలకొంది. దాతలు ముందుకు రావాలని పాఠశాల సిబ్బంది కోరుతున్నారు.

సహాయం చేయవలసిన సెల్ నెంబరు 7093992533, బ్యాంక్ ఎకౌంటు నెంబరు 73153213321, ఐ.ఎఫ్.ఎస్సి. కోడ్. నెంబరు ఏ.పీ.జీ.వీ.బీ 0001182, పెద్దపాడు  బ్రాంచ్, శ్రీకాకుళం రూరల్ మండలం.  

Related posts

హుజూర్ నగర్ నూతన టి ఎన్ జి వో యూనిట్ ఎన్నిక

Satyam NEWS

పాల్ ఘర్ లో స్వామీజీల హత్యకు జ్యోతి ప్రజ్వలన నివాళి

Satyam NEWS

పెరిగిన ఆర్టీసీ చార్జీలకు వామపక్షాలు నిరసన…

Satyam NEWS

Leave a Comment