36.2 C
Hyderabad
April 18, 2024 11: 17 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలు

#CollegesReopen

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి అన్‌లాక్‌-4 మార్గదర్శకాల ప్రకారం ప్రారంభం కానున్నాయి. కాలేజీలు ప్రారంభం అయినా విద్యార్థులకు తరగతులు ఉండవు.

పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే మాత్రమే టీచర్లు నివృత్తి చేస్తారు. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలలో సగం మంది మాత్రమే ఉపాధ్యాయులు విధులకు హాజరు అవుతారు.

ఆన్‌లైన్‌ తరగతు లు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

శనివారం వివిధ జిల్లాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో టీచర్ల సందేహాలను డీఈవోలు నివృత్తి చేశారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజరయ్యేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నందున పాఠాల వారీగా వర్క్‌షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను ఆదేశించారు.

Related posts

పివికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం

Satyam NEWS

పోస్టుపోన్: శ్రీవారి భక్తులకు పాక్షిక విజయం

Satyam NEWS

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

Satyam NEWS

Leave a Comment