27.7 C
Hyderabad
April 25, 2024 09: 25 AM
Slider మహబూబ్ నగర్

పాఠశాలలకు పైసలు కాదు పంతుళ్లు ముఖ్యం

ప్రభుత్వ పాఠశాలలకు పైసలు ముఖ్యం కాదని పాఠాలు చెప్పే పంతుల్లు ముఖ్యమని ఉప్పల చారిటబుల్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ హాస్టల్లో ఉండి ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యనభ్యసిస్తున్న బాలికలకు క్రీడా దుస్తులను ఉచితంగా గురువారం పంపిణీ చేశారు. ఈ దర్భంగా ఉప్పల ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ విద్యాలయాలకు కోట్ల రూపాయలు ఖ్యం కాదని విద్యను బోధించే ఉపాధ్యాయులు ముఖ్యమని తెలిపారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొని గణితం బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యలు వెనుకబడుతున్నారని, పదవ తరగతి విద్యార్థులు మార్చిలో బోర్డుపరీక్షలు జరుగుతాయని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయునికి ట్రస్టు ద్వారా నెలవారీగా జీతమిచ్చి విద్యార్థులకు గణిత బోధన ఇప్పించాలని ఎస్ హెచ్ ఓ అనితకు విన్నవించారు. కష్టపడి చదివి

తల్లిదండ్రులకు మీరు పుట్టిన గడ్డకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు మీ గమ్యం మీ చూపు మీ ఆశయం ఆలోచన చదవాలని కోరిక కసి పట్టుదలతో ఉంటే ఈ మానవ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. ప్రస్తుత సమాజంలో చదివే అన్నిటికీ ముఖ్యమని చదువు లేనిది మనం ఏది సాధించలేమని చదువుతోటే అన్ని సాధించవచ్చు అని అన్నారు.అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశంలో హాస్టల్ వసతిని పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయటం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, లకొండపల్లి సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్,శృతిలాయ కల్చరల్ అకాడమీ పౌండర్ దాస్ రావిచెడు మాజీ MPTC రంగయ్య,డాక్టర్ శ్రీను, రవి, రామచంద్రయ్య, మహేష్,నరేష్ గౌడ్,సాయి, రమేష్, శేఖర్, తిరుపతి, కృష్ణ,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెండో సగం?

Satyam NEWS

మూడు రోజుల్నించి అడుగుతున్నా సీఎం కలవడం లేదు

Satyam NEWS

అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌

Satyam NEWS

Leave a Comment