37.2 C
Hyderabad
April 19, 2024 13: 16 PM
Slider మహబూబ్ నగర్

కరోనా నేపథ్యంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి

#kalwakurthy

చాలా కాలం తర్వాత పాఠశాలలు ప్రారంభమైనందున అన్ని గ్రామ పంచాయతీ, మండలాల్లోని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పి చైర్మన్ పి. పద్మావతి అధికారులకు సూచించారు.  శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు జడ్పి చైర్మన్ అధ్యక్షతన వహించారు. 

ఉదయం 2వ స్థాయి సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పి చైర్మన్ మాట్లాడుతూ  ప్రత్యక్ష బోధనా తరగతులు ప్రారంభమైనందున పిల్లలు కరోనా  బారిన పడకుండా పంచాయతీరాజ్ శాఖ ద్వారా పకడ్బందీగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.   సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్నందున అన్ని గ్రామాలు, మండలాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేసారు. వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, సెగ్రిగేషన్ షెడ్లను వడకంలోకి తీసుకురావాలని సూచించారు.

మిషన్ భగీరథ పై చర్చిస్తూ గ్రామాల్లో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాన్క్ లు నిండి నీరు వృధాగా పారుతుందని తద్వారా  నీటి వృధాతో పాటుగా నీరు కాలనిలో ఆగి దోమల వ్యాప్తికి కారకమవుతుందన్నారు.  వాటర్ మెన్లను అప్రమత్తంగా ఉండే విధంగా అదేశించి నీటి వృధాను అరికట్టలన్నారు.  నల్లా కనెక్షన్లు లేని ఇళ్లకు వెంటనే నల్లా కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇండస్ట్రియల్ శాఖ పై సమీక్ష నిర్వహిస్తూ జిల్లాకు పరిశ్రమలు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  చిన్న పరిశ్రమలు స్థాపించుటకు పెట్టుకున్న రుణాలను లబ్ధిదారులకు సకాలంలో అందేవిధంగా చూడాలన్నారు. 

2,4 వ స్థాయి సంఘ సమావేశాలకు జడ్పి చైర్మన్ అధ్యక్షత వహించగా 5వ స్థాయి సంఘ సమావేశానికి పెంట్లవెల్లి జపిటిసి చిట్టెమ్మ అధ్యక్షత వహించారు. 

ఈ సమావేశానికి డిపిఓ రాజేశ్వరి, పిడి డిఆర్డీఏ నర్సింగ్ రావు, లింగాల  జడ్పిటిసి నేజమ్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పోలా శ్రీధర్, కల్వకుర్తి, సత్యం న్యూస్  

Related posts

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

సంక్రాంతి శోభ

Satyam NEWS

టీబీ నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రానికి మూడు పతకాలు

Satyam NEWS

Leave a Comment