36.2 C
Hyderabad
April 16, 2024 21: 37 PM
Slider ఆంధ్రప్రదేశ్

స్కూళ్లు రీ ఓపెన్‌పై సీఎం పున‌రాలోచించాలి..

cpi k. Ramakrishna

కరోనా విపత్తు నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

ఏపీలో 9, 10 తరగతులకు స్కూళ్లు తెరిచి 3 రోజులు కాకముందే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా సోకటం శోచనీయమని ఆయన అన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు టీచర్లు, స్టూడెంట్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

పెనువిప‌త్తుకు దారితీసే ప్ర‌మాదం..

ఈ విపత్కర పరిస్థితుల్లో పాఠశాల ప్రారంభం పెను విపత్తుకు దారితీస్తుంది. పైగా విద్యార్థుల పూర్తి ఆరోగ్య బాధ్యత తల్లిదండ్రులదే అన్నట్లు రాతపూర్వక లేఖలు తీసుకోవటం తగదు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం మానుకోండి అని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

విద్యాసంస్థల రీ-ఓపెన్ కు కేంద్ర మార్గదర్శకాలు ఇవే

Satyam NEWS

రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ వ్యక్తిత్వానికి కాదు

Satyam NEWS

వైభవంగా సాగుతున్న మోపిదేవి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment