28.7 C
Hyderabad
April 20, 2024 10: 52 AM
Slider ముఖ్యంశాలు

బడిగంటలు మోగడం ఇప్పటిలో ఇక కష్టమే

#Telangana Schools

రాష్ట్రంలో బడులకు లాకౌటేనా?ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలే లేవా? దాదాపుగా ఇదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ఇక ముగిసినట్లే భావించవలసి ఉంటుంది. కోవిడ్ ఉధృతి కారణంగా గత ఏడెనిమిది నెలలుగా బడులు మూతబడి ఉన్నాయి.

ఒకవేళ తెరచి నిర్ణీత వ్యవధి బడి గంటలను తగ్గించి ప్రయోగం చేద్దామనుకున్నా ఆ ప్రయత్నం ఫలించేటట్టు లేదు.

వేసవి కాలంలో మార్నింగ్ స్కూల్స్ మాదిరిగా నిర్వహించాలనే ప్రతిపాదనలను కూడా ప్రభుత్వాలు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా విద్యా సంవత్సరంలో కచ్చితంగా సిలబస్ పూర్తిచేయాలనే నిబంధనలు  ఉండటంతో  పాఠశాలల యాజమాన్యాలు కిందా మీదా పడుతున్నాయి. చాలా స్కూళ్లు ఇప్పటికే సిలబస్ త్వరితగతిన పూర్తి చేయడానికి వివిధ రకాల కసరత్తులు మొదలుపెట్టాయి.

Related posts

ఏపి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవి

Satyam NEWS

క్రిస్మస్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలి

Satyam NEWS

ఎనదర్ స్టోరీ: ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ గ్రామంలో…

Satyam NEWS

Leave a Comment