37.2 C
Hyderabad
April 19, 2024 11: 07 AM
Slider నెల్లూరు

వి ఎస్ యూ పి జి సెంటర్ కావలి లో ఘనంగా సైన్స్ డే వేడుకలు

#kavali

కావలి లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల లో జాతీయ సైన్స్ దినోత్సవం డా యం సుశీల, సహాయ ఆచార్యులు,జంతు శాస్త్ర విభాగము వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంఛార్జి ప్రిన్సిపాల్ డా ఏ.శివ శంకర్ రెడ్డి, డా వి.శైలజ, సహాయ ఆచార్యులు జంతు శాస్త్ర విభాగం పాల్గొన్నారు. ఇంఛార్జి ప్రిన్సిపాల్ డా శివ శంకర్ మాట్లాడుతూ సైన్స్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలి అని చెప్పారు.

డా వి.శైలజ మాట్లాడుతూ విజ్ఞాభివృద్దికి చేయూతనిచ్చే సంస్థలు వాటి ఉపయుక్తాలు విద్యార్థులకు తెలియ చేశారు. ఈ కార్యక్రమ సమన్వయ కర్త డా ఎం సుశీల మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రం మన దైనందిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది అని, సృజనాత్మకత మరియు సమర్థత మేళవింపు తో మంచి పరిష్కారాలు కనుగొనవచ్చు అని వాటిని అవసరానికి తగ్గట్టుగా అభివృద్ధి పరచడం అవసరమని తెలియచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన మరియు వకృత్ఠ్వ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో అన్ని సైన్స్ విభాగాల విద్యార్థినీ,విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని జయప్రదం చేశారు.

Related posts

సిఎం జగన్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వద్దు

Satyam NEWS

సిరెంజిల కొరత ముప్పు ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Sub Editor

డైలీ వన్ :మైనర్ బాలికపై యువకుడి అత్యాచారం

Satyam NEWS

Leave a Comment