32.2 C
Hyderabad
March 28, 2024 21: 33 PM
Slider ఖమ్మం

శ్రీ రామకృష్ణ విద్యాలయం లో సైన్స్ ఎక్స్పొ

#ramakrishna school

ఖమ్మం గుట్టలబజార్ లోని శ్రీ రామకృష్ణా విద్యాలయం లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు జరిగినాయి . ఒకటవ తరగతి పిల్లలు సైతం చాలా ఉత్సాహంగా పాల్గొని , వారు ఎంచుకున్న ప్రాజెక్టు లను వచ్చిన అతిదులకు పేరెంట్స్ కి చక్కగా వివరించారు . ఇటువంటి కార్యక్రమాలు జరపటం వల్ల పిల్లలలో ఆలోచనా శక్తి, అలాగే ఆవిష్కరణల మీద ఆసక్తి పెంపొందుతాయి అని పాఠశాల అధ్యక్షులు శ్రీ రక్ష హాస్పిటల్స్ ఎమ్ డి డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు అన్నారు . పిల్లలు ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో ఓపికతో వినయ విధేయతలతో వివరించారని అతిధి గా విచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్ విశ్వేశ్వర రావు గారు అన్నారు. పిల్లలకు స్నాక్స్ ను అందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల అధ్యక్షులు శ్రీ రక్ష హాస్పిటల్స్ ఎమ్ డి డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు , లయన్స్ క్లబ్ మెంబర్ విశ్వేశ్వర రావు , పాఠశాల ప్రధానాచార్యులు సంతోష గౌతం , అధ్యాపక , అధ్యపకేతర సిబ్బంది పాల్గొన్నారు .

Related posts

పల్లె ప్రగతి పురోగతి సంతృప్తికరంగా ఉంది

Satyam NEWS

బిఆర్ఎస్ ఐక్యత రాగం

Bhavani

మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్

Satyam NEWS

Leave a Comment