30.7 C
Hyderabad
April 17, 2024 01: 01 AM
Slider ఖమ్మం

విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ చూపాలి

#geetamuniversity

విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ చూపాలని తద్వారా దేశానికి సేవ చేసేందుకు దోహదపడుతుందని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కమీషనర్ లావిడియా జీవన్ లాల్ అన్నారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఉత్సాహం చూపడం వలన భవిష్యత్తులో సైంటిస్టులుగా మారి దేశ రక్షణలో ప్రధాన పాత్ర వహించే మహత్తర అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించిన వివిధ ప్రయోగాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు భవిష్యత్ సైంటిస్టులుగా ఎదగాలంటే సైన్స్ పై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. జీవన్ లాల్ స్వయంగా గీతం యూనివర్సిటీ వారితో మాట్లాడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.

ప్రదర్శనలో ఉంచిన ఉత్తమ ప్రదర్శనలకు క్విజ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు నగదు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఆశ్రమ పాఠశాలకి సుమారు రూ.లక్ష విలువ గల రసాయన పరికరాలను ఆయన అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవన్ లాల్ కు ఉపాధ్యాయులు, విద్యార్థినిలు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ ప్రతినిధులు, ఎంఈఓ వెంకట్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎంపీపీ లావిడియో సోనీ, జడ్పిటిసి కళావతి, సర్పంచులు కిషన్ లాల్, నరసింహారావు, శాంతి లాల్, రాములు, శాంతిరాం, నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, కొమ్మినేని పాండురంగారావు, యదల్లపల్లి వీరభద్రం, లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, కాజా రమేష్, వేల్పుల నరసింహారావు, బీఆర్ఎస్ మండల, అధ్యక్ష కార్యదర్శులు పొన్నెకంటి సతీష్, నున్న రంగారావు, మాజీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, దుద్దుకూరు కృష్ణ ప్రసాద్, రామిశెట్టి రాంబాబు, మోదుగు రామకృష్ణ, భానోత్ ధర్మ, పనితి వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు.

Related posts

అధికారిక సమావేశాలకు ‘బినామీ’ ప్రజాప్రతినిధులు

Bhavani

G-7 సమ్మిట్: భారత్ కు ఆహ్వానం జర్మనీ పునరాలోచన?

Satyam NEWS

గవర్నర్ పర్యటనకు సకల ఏర్పాట్లు చేయాలి

Satyam NEWS

Leave a Comment