24.7 C
Hyderabad
March 29, 2024 06: 53 AM
Slider ప్రపంచం

సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపంలో లార్వాలు ..

‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ నీటి అడుగున ఉన్న 14 రకాల లార్వాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’లో 3,000 అడుగులు లోతైన ప్రాంతాల్లో నివసించే పలు రకాల జాతుల లార్వాలుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

రొయ్యలు, ఎండ్రకాయల జాతికి చెందిన ఈ జీవులు ఏలియన్స్ రూపాన్ని కలిగి ఉన్నాయని.. వీటిల్లో కొన్నిటికి తలలపై కొమ్ములు ఉన్నాయని స్పష్టం చేశారు. నారింజ, నీలం రంగు వంటి వివిధ షేడ్స్‌తో ఉన్న ఈ లార్వాలు .. సముద్ర జీవుల వయోజన వెర్షన్‌లతో పోలిస్తే విచిత్రమైన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.

వెలుగులోకి వచ్చిన 14 జీవుల లార్వాలు జీవన విధానం.. లైఫ్ సైకిల్, అవి ఏ విధంగా పెరుగుతాయి వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు.

Related posts

నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి

Satyam NEWS

అత్తి వరదరాజస్వామి సేవలో కేసీఆర్

Satyam NEWS

రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Bhavani

Leave a Comment