28.7 C
Hyderabad
April 25, 2024 05: 05 AM
Slider నల్గొండ

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

#Awarenes programme

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గోవిందాపురంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సూచించారు.

సీజన్లో సోకే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు నీటి నిల్వ కేంద్రాలలో దోమలు పెరుగుతాయని, కానుక ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, మనం నివసించే ప్రాంతాలలో మురుగు నీరు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని  సూచించారు.

కరోనా వ్యాధి ప్రబలకుండా వ్యక్తిగత దూరం పాటించడం  మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపరచుకోవడం వంటివి తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల  రామకృష్ణ , పి. సావిత్రి, ఆశా కార్యకర్తలు సావిత్రి, జ్యోతి  పాల్గొన్నారు.

Related posts

జూన్ 6 నుంచి విజయనగరం సంగీత కళాశాలలో తరంగ గానం

Satyam NEWS

ములుగు జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

Satyam NEWS

Leave a Comment