28.2 C
Hyderabad
April 20, 2024 13: 18 PM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో పూటుగా నాటు సారా

#Illicit Liquor

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నాటుసారా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కచ్చితమైన సమాచారం అందుకున్న SEB సిబ్బంది బట్టీలపై దాడులు చేసి 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

యర్రగొండపాలెం మండం కాశికుంటతండా సమీపంలోని నల్లమల అడవిలో, అక్రమదారులు నాటుసారా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని భారీగా నాటుసారా కాస్తున్నారు. సమాచారం అందుకొన్న SEB అధికారి రవికుమార్ తన సిబ్బందితో నాటుసారా స్ధావరాలపై దాడులు నిర్వహించి, ముగ్గురు నాటుసారా తయారీదారులను అదుపులోకి తీసుకొన్నారు.

సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొన్నారు. ప్రాణంతకమైన నాటుసారా తయారీ చట్టరిత్యా నేరమని తయారీదారులపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని, ప్రాణాంతకమైన నాటుసారాను మందుబాబులు తాగటం ఆపేయ్యాలని SEB అదికారి రవికుమార్ అన్నారు.

Related posts

వి ఎస్ యూనివర్సిటీ లో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు

Satyam NEWS

ఏపిలో రూ.500 కోట్ల ‘బైజూస్’ కుంభకోణం

Satyam NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Satyam NEWS

Leave a Comment