31.2 C
Hyderabad
April 19, 2024 03: 39 AM
Slider ముఖ్యంశాలు

ధిక్కరించిన అధికారిపై వేటు వేసిన నిమ్మగడ్డ

#Nimmagadda Rameshkumar

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డుగా నిలుస్తున్న ఒక అధికారిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జీవీ సాయి ప్రసాద్‍పై ఆయన వేటు వేశారు.

జీవీ సాయి ప్రసాద్‍ ఎన్నికల వేళ కమిషనర్ కు చెప్పకుండా 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి.

దాంతో ఈ చర్యను క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించారు. ప్రస్తుత ఎన్నికలకు ఈ చర్యలు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని ఎన్నికల కమిషనర్ అభిప్రాయపడ్డారు.

ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధులనుంచి తొలగిస్తున్నాం అని ఆయన ప్రకటించారు.

ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి కూడా వీల్లేదని ఎస్‍ఈసీ తన ఆదేశాలలో పేర్కొన్నారు.

Related posts

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

Murali Krishna

ఇంద్రకీలాద్రిలో దసరా మహోత్సవాల కరపత్రం విడుదల

Satyam NEWS

విజయనగరం లో యోగి వేమన జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment