35.2 C
Hyderabad
April 24, 2024 14: 16 PM
Slider హైదరాబాద్

క‌రోనా నేప‌థ్యంలో ఆద‌ర‌ణ ల‌భించ‌క రైళ్ల ర‌ద్దు..

scr

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజా రవాణా కంటే వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనితో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య తగ్గుతోంది. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని క్రమక్రమంగా రైల్వేశాఖ సర్వీసులను పెంచినా కూడా ఆదరణ లభించడం లేదు. ఈ క్రమంలోనే గురువారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాగా, కరోనాకు ముందు ఈ రైళ్లలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి

విశాఖపట్నం- విజయవాడ- విశాఖపట్నం
నాందేడ్- పాన్వెల్- నాందేడ్
ధర్మాబాద్‌- మన్మాడ్- ధర్మాబాద్
తిరుపతి- కొల్హాపూర్- తిరుపతి
కాచిగూడ- నార్కేర్- కాచిగూడ
కాచిగూడ- అకోలా-కాచిగూడ

Related posts

తెలుగు సినిమా ‘‘జీరో’’లు స్పందించరేమిటి?

Satyam NEWS

భాగ్యనగర్ యువకులారా…. మజ్లిస్ సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Murali Krishna

Leave a Comment