కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో రెండవ విడత పల్లె ప్రగతిని విజయవంతం చేద్దామని ప్రత్యేక అధికారి పోచయ్య అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగతి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2నుండి 11 తేదీ వరకు గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్నామని మిగిలిన వాటిని ఈ రెండో విడత పల్లె ప్రగతిలో పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారితో పాటు సర్పంచ్ శ్రీరేఖ రాజు, ఉప సర్పంచ్ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ వీరేశం, పంచాయతీ అధికారులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.