31.7 C
Hyderabad
April 18, 2024 23: 59 PM
Slider ప్రత్యేకం

కాపీ క్యాట్: 2 వేల నోటుపై సెక్యూరిటీ ఫీచర్లు డొల్లే

rs 200 notes

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో రెండు వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో 56.31 శాతం మేరకు రెండు వేల రూపాయల నోట్లేనని ఎన్‌సిఆర్‌బి వార్షిక నివేదిక వెల్లడించింది. 2016 నవంబర్ 8 న ప్రధాని నరేంద్ర మోడీ దేశం లోని రూ.1000, రూ.500 నోట్లపై నిషేధాన్ని ప్రకటించారు.

రూ.1000 మరియు రూ.500 నోట్లను పెద్ద నోట్లను ఉపసంహరించుకున్న తరువాత దేశంలో నోట్ల సంక్షోభం తలెత్తింది. నగదు కొరతతో దేశం అల్లాడిపోయింది. ఎక్కడా నోట్లు దొరకని పరిస్థితితో సామన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ దశలో కొత్తగా రూ.2000 నోటు, కొత్త రూ.500 నోట్లను జారీ చేశారు.  కొత్త నోట్లలో ప్రత్యేక భద్రతా లక్షణం ఉంటుందని, ఇది నకిలీ నోటును ముద్రించడం కష్టతరం చేస్తుందని రకరకాలుగా చెప్పారు.

ఈ సెక్యూరిటీ ఫీచర్ల కారణంగా నకిలీ నోట్ల తలనొప్పి తగ్గుతుందని భావించారు. అయితే ఇదంతా పసలేని వాదనగా తేలిపోయింది. రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం ఎంతో సులభమని ఇటీవల స్వాధీనం చేసుకున్ననకిలీ నోట్లు స్పష్టం చేస్తున్నాయి. రెండువేల రూపాయల నోట్ల వెనుక మోడీ ప్రసంగం ఉంటుందని, ఈ నోట్లన్నీ శాటిలైట్ తో అనుసంధానం కలిగి ఉంటాయని, ఎక్కడైనా భారీ మొత్తంలో రెండు వేల రూపాయల నోట్లను జమచేస్తే ఇట్టే పట్టేసుకోవచ్చునని చెప్పిన వన్నీ కబుర్లే.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మూడేళ్లలో పెద్ద నోట్ల  నిషేధం తరువాత దేశంలో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో 56 శాతం రూ .2000 నోట్లే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రూ. 46.06 కోట్ల విలువైన నకిలీ భారతీయ కరెన్సీలను 2017, 2018 సంవత్సరాల్లో వివిధ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. నకిలీ నోట్లలో రూ .2000 నోట్ల మొత్తం పెరుగుతోందని నివేదిక సూచించింది. 

గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ నకిలీ కరెన్సీకి కేంద్రంగా మారాయి. జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం లలో మాత్రమే రూ .2000 రూపాయల నోట్లు పట్టుబడలేదు.  ప్రధానమంత్రి ప్రకటన వచ్చిన వెంటనే రూ .2000 నకిలీ కరెన్సీ నోట్లను విస్తృతంగా పంపిణీ చేసినట్లు ఎన్‌సిఆర్‌బి రికార్డులు చూపిస్తున్నాయి.

Related posts

ఐఏఎస్… ఐపీఎస్ లు బీఆర్ఎస్ పార్టీ తొత్తులా

Bhavani

అన్ని వ‌ర్గాల మేలే బీజేపీ ల‌క్ష్యం

Sub Editor

అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం

Satyam NEWS

Leave a Comment