21.2 C
Hyderabad
December 11, 2024 22: 02 PM
Slider తెలంగాణ

వచ్చే ఏడాది విత్తన సరఫరాకు ఏర్పాట్లు ఆరంభం

mini niranjan

పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉన్నందున వచ్చే ఏడాదికి విత్తానాలు మరింత ఎక్కువగా అవసరం అవుతాయని అందువల్ల విత్తనోత్పత్తిని భారీగా పెంచాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. విత్తనాభివృద్ది సంస్థ అధికారులతో హాకా భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉత్పాదకత, నాణ్యత కలిగిన కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. కెఎన్ఎం 118, ఎంటియు 1010, ఆర్ఎన్ఆర్ 15048 కొత్త వరి వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అదే విధంగా టొమాటో, మిరప, బెండ లాంటి కూరగాయల విత్తనోత్పత్తి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. గతం కన్నా 5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెంచుతూ 2019 – 20 సంవత్సరానికి 8.07 లక్షల క్వింటాళ్లు విత్తన ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామని ఆయన అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలలో తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది యాసంగి సీజన్ కు  40,253 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరాచేశామని ఆయన తెలిపారు. వచ్చే నవంబరు మొదటివారం వరకు విత్తన సరఫరా జరుగుతుందని, శనగ విత్తన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో మంత్రితో బాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారధి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు , సంస్థ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

56 రోజుల పోరాటంతో సిద్ధించిన రాష్టం

Bhavani

జనసేన లోకి పిల్లి సుభాష్ చంద్రబోస్?

Bhavani

అంతర్జాతీయ ప్రయాణం ఇకపై ప్రధాన టెర్మినల్‌ నుండి

Satyam NEWS

Leave a Comment