24.7 C
Hyderabad
October 26, 2021 04: 12 AM
Slider ప్రత్యేకం

మున్నూరు కాపుల డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా

#seetakka

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ డిమాండ్ ను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.

ఆదివారం క్యాంప్ కార్యాలయంలో ములుగు నియోజక వర్గ కో ఆర్డినేటర్ పిట్టల మధుసూదన్ పటేల్ అధ్వర్యంలో మున్నూరు కాపు నేతలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా  మధుసూదన్ పటేల్ మాట్లాడుతూ  తెలంగాణలో నివసిస్తున్న మున్నూరు కాపులు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారని తెలిపారు. పంటలు బాగా పండితేనే మున్నురు కాపుల జీవనం సాఫీ గాసాగుతుందని అన్నారు.

అయితే మున్నురు కాపులు వ్యవసాయాన్ని వదులుకోలేక ఇతర వృత్తుల వైపు మళ్ళడానికి ఆర్థిక స్తోమత లేక, నైపుణ్య శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మున్నూరు కాపులు ఆర్ధికంగా ఎదగాలంటే   కార్పొరేషన్ ఏర్పాటే శరణ్యమని దానికి సహకారం అందించాలని కోరారు. స్పందించిన సీతక్క మాట్లాడుతూ తప్పకుండా మున్నూరు కాపుల డిమాండ్ ను అసెంబ్లీలో చర్చిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి పటేల్, మండల కో ఆర్డినేటర్ సిరికొండ బలరాం పటేల్, చింతనిప్పుల బిక్షపతి పటేల్, సుంకరి రవీందర్ పటేల్, తోట తిరుపతి పటేల్, గందే శ్రీను పటేల్, అకుతోట చంద్రమౌళి పటేల్, కాపిడి ప్రభాకర్ పటేల్, పంచగిరి బాబురావు పటేల్, ఎడ్ల సంపత్ పటేల్, పగడాల ఓం ప్రకాష్ పటేల్, గందె మధు పటేల్, గండ్రత్ శ్రీనివాస్ పటేల్, సొంనరసయ్య పటేల్, నల్లెల్ల రవీందర్ పటేల్, పిట్టల శివతేజ పటేల్, గోలి మల్లయ్య పటేల్, బరిగల రాజయ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీడలకు నిలయంగా విజ్జి స్టేడియం

Sub Editor

రైట్ రైట్: ఆర్టీసీలో ఉద్యోగ భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం

Satyam NEWS

Danger: భారత్ లో భావ ప్రకటనాస్వేచ్ఛకు భంగం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!